Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఘోర అవమానం ?
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘోర అవమానం ఎదురయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరు కూడా గుర్తించడం లేనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు… ఆయన ఎవరో తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మొన్నటికి మొన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. దీంతో అతని జైల్లో వేశాడని కూడా వార్తలు వచ్చాయి.
ఇక తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరో అవమానం ఎదురయింది. రేవంత్ రెడ్డిని టాలీవుడ్ నటి జయసుధ.. గుర్తించలేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తెలుగు ప్రపంచ సామాఖ్య కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టించుకోకుండా నటి జయసుధ వ్యవహరించినట్లు… సోషల్ మీడియాలో కొందరు వార్తలు ప్రచురణ చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కనే ఉన్న వారిని నమస్కరించారు కానీ… రేవంత్ రెడ్డిని ఏమాత్రం పలకరించలేదని నటి జయసుధ పై ఫైర్ అవుతున్నారు. ఆయన వద్దకు రాగానే ముఖం తిప్పుకొని ఆమె నేరుగా తన సీటు వైపు వెళ్లినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలకరించాలని చూసినా… ఆమె చూసి చూడనట్టు వెళ్లిపోయినట్లు.. గులాబీ పార్టీ సోషల్ మీడియా కూడా వైరల్ చేస్తోంది. మంత్రులే కాదు నటులు సైతం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మర్యాద ఇవ్వడం లేదని… గులాబీ పార్టీ సోషల్ మీడియా సెటైర్లు పేల్చడం జరుగుతోంది.