Jayasudha: సీక్రెట్ గా మూడో పెళ్లి చేసుకున్న జయసుధ విదేశాల్లో ఎంజాయ్.?
Jayasudha: నటి జయసుధ ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఊపు ఊపిన హీరోయిన్. వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, కృష్ణ, లాంటి స్టార్ హీరోలతో తెరను పంచుకుంది. ఇండస్ట్రీలో వైవిద్యమైన పాత్రలు చేస్తూ సహజనటిగా గుర్తింపు పొందినటువంటి జయసుధ తన రియల్ లైఫ్ లో కూడా అద్భుతంగా రాణించింది. అలాంటి ఈనటి ఎక్కడ కనిపించడం లేదు. సినిమాల్లో ఉండగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె రాజకీయాల్లో కూడా కొన్నాళ్ళ కింద మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Jayasudha who secretly got married for the third time
ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉండడం లేదని తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే నటి జయసుధ రాజకీయాలనుంచి తప్పుకుందా అని చాలామంది అనుకుంటున్నారు. ఆమె ఏం చేస్తుంది ఆ వివరాలు ఏంటో చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జయసుధ తన రాజకీయ జీవితానికి కాస్త దూరం అయిపోయింది. 2009 సమయంలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా చేసింది జయసుధ. (Jayasudha)
Also Read: Samantha: పెళ్లైన హీరోకి ప్రపోజ్ చేసిన సమంత..?
ఆ తర్వాత ముఖ్యమంత్రులు అయినటువంటి వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య హయాంలో చాలా యాక్టివ్ గా కనిపించిన ఈమె ప్రస్తుతం ఆమె పొలిటికల్ యాక్టివిటీస్ తగ్గించుకుందని చెప్పవచ్చు. దాదాపు దశాబ్ద కాలానికి పైగా కాంగ్రెస్ లో కొనసాగిన ఈమె, గత ఎన్నికలకు ముందు బిజెపిలో చేరింది. బిజెపికి క్రిస్టియన్ల మద్దతు కూడగడతానని చెప్పిన ఈమె, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కిషన్ రెడ్డికి మద్దతు ఇచ్చింది. ఆ ఎన్నికల తర్వాత ఈమె చాలా సైలెంట్ అయిపోయింది.

ఓ వైపు సినిమాల్లో మరోవైపు రాజకీయాల్లో ఎక్కడా కూడా ఈమె పేరు వినిపించడం లేదు. దీంతో చాలామంది నెటిజన్స్ ఆమె అభిమానులు జయసుధ సినిమాలకు దూరమై రాజకీయాల్లో రాణిస్తుంది, అనుకుంటే చివరికి రాజకీయాలకు కూడా దూరమైంది. అయితే గత కొద్ది రోజుల నుండి జయసుధ మూడో పెళ్లి వార్తలు వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా జయసుధ మూడో పెళ్లి చేసుకొని విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంది అంటూ కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.మరి నిజంగానే జయసుధ మూడో పెళ్లి చేసుకుందా అనేది తెలియాల్సి ఉంది.(Jayasudha)