Telangana: కాలేజీలకు నాలుగవ శనివారం రోజున సెలవు ?


Telangana: జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ విద్యార్థులకు శుభవార్తను అందజేసింది. జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ గురువారం రోజున కీలక ప్రకటనను వెల్లడించింది. ఇక పైన యూనివర్సిటీ పరిధిలోని కార్యాలయాలకు, కాలేజీలకు ప్రతి నెల నాలుగవ శనివారం రోజున సెలవు ఇస్తున్నట్లుగా తమ ప్రకటనలో వెల్లడించారు.

JNTU-Hyderabad Declares Second and Fourth Saturdays as Holidays

2008కి ముందు ఉన్న సెలవు విధానాలను తిరిగి ప్రవేశపెట్టినట్లు జేఎన్టీయూ కొత్త వీసీ కిషన్ కుమార్ రెడ్డి ఈ మేరకు ప్రకటనలో తెలియజేశారు. యూనివర్సిటీ పరిధిలోని అన్ని విభాగాలలోని అధికారులు ఈ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. తాజా ప్రకటన ఈనెల 22 నుంచి అమలులోకి రాబోతోంది.

కాగా, జేఎన్టీయూ హైదరాబాద్ ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం కొత్తదేమి కాకపోవడం విశేషం. 2008కి ముందు కూడా ఈ విధానాన్ని అమలు చేశారు. అయితే 2008 తర్వాత కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ విధానాన్ని రద్దు చేయడం జరిగింది. మళ్లీ ఇప్పుడు తాజాగా ఈ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు యూనివర్సిటీ తమ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *