Jogi Ramesh: వైసీపీకి మరో షాక్… టిడిపిలోకి జోగి రమేష్?
Jogi Ramesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఏపీలో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత…. ఆ పార్టీ నేతలు అందరూ ఒక్కొక్కరు జారుకుంటున్నారు. ఇక్కడ ఛాన్స్ దొరికితే అక్కడికి వెళ్ళిపోతున్నారు. జనసేన లేదా తెలుగుదేశం పార్టీలోకి జంప్ అవుతున్నారు. Jogi Ramesh

Jogi Ramesh Will joins TDP
ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి కీలక నేతలు బయటకు వెళ్లారు. అయితే తాజాగా… మాజీ మంత్రి జోగి రమేష్ కూడా… టిడిపి పార్టీ నేతల టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. నూజివీడు పట్టణంలో గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ తాజాగా జరిగింది. Jogi Ramesh
Also Read: Yuvraj: పెన్షన్ డబ్బులతో బతుకుతున్న టీమిండియా ప్లేయర్ ?
అయితే ఈ కార్యక్రమానికి టిడిపి నేతలతో కలిసి మాజీ మంత్రి జోగి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కంటతడి కూడా పెట్టారట జోగి రమేష్. ఏపీ మంత్రి పార్థసారధి అలాగే టిడిపి ఎమ్మెల్యే గౌతు శిరీష తో నూజివీడులో నిర్వహించిన ర్యాలీలో జోగి రమేష్ పాల్గొనడం జరిగింది. గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ లో కూడా జోగి రమేష్ పాల్గొన్నారు. దీంతో జోగి రమేష్ టిడిపిలోకి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే జోగి రమేష్ తో కలవడంపై టీడీపీ నేతలకు లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. Jogi Ramesh