Journalist Shankar: జర్నలిస్ట్ శంకర్ అరెస్ట్… 14 రోజుల రిమాండ్?
Journalist Shankar: న్యూస్ లైన్ తెలుగు యూట్యూబర్ ఛానల్ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు శంకర్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా యూట్యూబ్ జర్నలిస్టు శంకరును హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. జర్నలిస్టు శంకర్ పైన అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది.

Journalist Shankar arrested and remand
తనపై శంకర్ అ****చారం చేశాడని ఈ ఫిర్యాదులో పేర్కొంది ఆ మహిళ. దీంతో శంకర్ పై పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు అయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధితురాలు ఆరోపణలు చేసింది. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో శంకర్ పోస్టులు పెడుతున్నాడని కూడా మహిళా తన ఫిర్యాదులు వెల్లడించింది.
Sridhar Babu: ఉగాది తర్వాత “ఏఐ సిటీ” నిర్మాణానికి భూమి పూజ
దీంతో ఇవాళ ఉదయం జర్నలిస్ట్ శంకర్ ను అరెస్టు చేశారు పోలీసులు. అనంతరం కోర్టు ముందు హాజరు పరిచారు. ఈ తరుణంలోనే యూట్యూబర్ శంకర్కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. అనంతరం శంకరును చంచల్గూడా జైలుకు పోలీసులు తరలించారు.
Harish Rao: తెలంగాణ అప్పుల చిట్టా బయటపెట్టిన హరీష్ రావు ?