Revanth Reddy: పగతోనే బన్నీ అరెస్ట్.. స్టార్ అవుదాం అనుకుంటే ఫ్లాప్.. రేవంత్ రెడ్డిపై జర్నలిస్టు షాకింగ్ కామెంట్స్..?
Revanth Reddy: ప్రస్తుతం సోషల్ మీడియా, మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ అరెస్టు గురించే మాట్లాడుకుంటున్నారు. నేషనల్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ అర్ధంతరంగా అరెస్ట్ అవ్వడంతో ఆయన అభిమానులు తీవ్రంగా మనోవేదన చెందుతున్నారు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే మళ్లీ బెయిల్ పై బయటకు వచ్చారు.. అలాంటి అల్లు అర్జున్ అరెస్టుపై తాజాగా ప్రముఖ జర్నలిస్టు అర్నబ్ గోస్వామి షాకింగ్ విషయాలు బయట పెట్టారు. మీడియా లైవ్ లో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయారు. ఇంతకీ ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..
Journalist shocking comments on Revanth Reddy
డిసెంబర్ 5వ తేదీన పుష్పా2 సినిమా రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. రాత్రి బెనిఫిట్ షో వేయడంతో చాలామంది అభిమానులు థియేటర్లకు పరుగులు తీశారు. ఇదే తరుణంలో అల్లు అర్జున్, రష్మిక ఇతర కుటుంబ సభ్యులు మొత్తం థియేటర్ కు రావడంతో అక్కడ జనాల తాకిడెక్కువయింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కేసు విషయమై అల్లుఅర్జున్ ను డిసెంబర్ 13వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు.(Revanth Reddy)
Also Read: Chiranjeevi: అల్లు అర్జున్ కోసం చిక్కడపల్లికి బయలుదేరిన చిరంజీవి..దిల్ రాజు!!
అయితే అల్లు అర్జున్ అరెస్టు వెనుక ప్రధాన కారకుడు రేవంత్ రెడ్డి అంటూ అర్నబ్ గోస్వామి సంచలన కామెంట్స్ చేశారు. ప్లాన్ లో భాగంగానే శుక్రవారం మధ్యాహ్నం ఆయన అరెస్టు చేశారు. ఈ టైంలోనే ఆయన అరెస్ట్ చేయడం వెనుక రేవంత్ రెడ్డి ప్లాన్ ఉందని శుక్రవారం అరెస్ట్ అయితే శనివారం, ఆదివారం సెలవు కాబట్టి బెయిల్ మంజూరు కాక రెండు రోజులు జైల్లో పెట్టించాలని చూశారట.
కానీ ఇందులో రేవంత్ రెడ్డి వేసిన ప్లాన్ ఫెయిల్ అయిపోయిందని రేవంతు ఫ్లాప్ యాక్టర్ అర్నబ్ గోస్వామి అన్నారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ అయినా కానీ అర్ధరాత్రి సమయం వరకు బన్నీకి బెయిల్ మంజూరు అయింది. దీంతో రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నం చేసిన ఆయన ప్లాన్ ఫలించ లేదంటూ అర్నబ్ గోస్వామి మీడియా ముఖంగా తెలియజేయడంతో ఆ మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రియాక్ట్ అవుతూ తీవ్రంగా ఖండిస్తున్నారు.(Revanth Reddy)