Jr. NTR: Jr.ఎన్టీఆర్ జీవితమంతా అవమానాలే.. పుట్టిన నుండి మొదలు.?
Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన మైలురాయిని ఏర్పాటు చేసుకున్నారు.. ఆయన ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబంలో పుట్టినా కానీ అష్ట కష్టాలు ఎదుర్కొన్నాడు.. తాత ఎన్టీఆర్ మరణం తర్వాత నందమూరి ఫ్యామిలీకి దూరమై ఎన్నో చీత్కారాలు ఎదుర్కొని వాటన్నింటినీ తన కాలి కింద గట్టిగా తొక్కి పెట్టి చివరికి పంజా విసిరిన సింహంలా ఎదిగి ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారని చెప్పవచ్చు..
Jr.NTR whole life is insulting
అలాంటి ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి దూరమవ్వడానికి కారణాలేంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ఎన్టీఆర్ కొడుకుగా హరికృష్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన ముందుగా లక్ష్మీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమె భార్యగా ఉండగానే మరో యువతి శాలినిని వివాహం చేసుకున్నారు.. శాలినికి పుట్టిన వ్యక్తి ఎన్టీఆర్.. అయితే జూనియర్ ఎన్టీఆర్ ను చిన్నతనం నుంచే నందమూరి ఫ్యామిలీలో కలుపుకోవడానికి ఎవరు ఒప్పుకోలేదు. చివరికి సీనియర్ ఎన్టీఆర్ చేరదీసి నటన వైపు అడుగులు వేసేలా చేశారు. (Jr.NTR)
Also Read: Majaaka Movie: ఈ సారైనా సందీప్ కిషన్ కు హిట్ వచ్చేనా.. “మజాకా” బజ్ గట్టిగానే!!
ఎప్పుడైతే సీనియర్ ఎన్టీఆర్ మరణించారో అప్పటినుంచి ఇక నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ దూరమయ్యారని చెప్పవచ్చు. ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏదైనా సరే ఆయనను పిలిచి అవమానించేవారు. ఇక బాలకృష్ణ కూతురు వివాహానికి పిలిచి ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఆయన మధ్యలోనే వెళ్లిపోయారు. అయినా ఎన్టీఆర్ తన ఫ్యామిలీ అంటే ఎప్పుడు కూడా కోపానికి రాకుండా తనంటే ఏంటో నిరూపించాలనుకున్నాడు.
తన తాతకు పేరు తేవాలనుకున్నాడు.. ఆ విధంగానే సినిమాల్లో దూసుకువెళ్లి పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని నందమూరి నట వారసుడు అనే పేరు తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అంటే తాతకు తగ్గ మనవడు అంటారు.. ఇలా ఒక్కో బాధను ఒక్కో మెట్టుగా తయారు చేసుకొని తన విజయానికి సోపానాలుగా మలచుకుంటూ దూసుకెళ్లారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడంతో తన బాబాయ్ బాలకృష్ణ, అన్నయ్య కళ్యాణ్ రామ్ దగ్గరికి తీసుకుంటున్నారు.(Jr.NTR)