Jyothika Responds to Kanguva : వేరే హీరోల చెత్త సినిమాలకన్నా నా భర్త సినిమాలు బాగుంటాయి.. జ్యోతిక సంచలన వ్యాఖ్యలు!!


Jyothika Responds to Kanguva Criticism

Jyothika Responds to Kanguva : ప్రముఖ నటి జ్యోతిక (Jyothika), స్టార్ హీరో సూర్య (Suriya) భార్య, తన భర్త నటించిన కంగువ (Kanguva) సినిమాపై వచ్చిన తీవ్ర విమర్శలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలీవుడ్‌లో బిజీగా ఉన్న జ్యోతిక, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కంగువపై వచ్చిన నెగెటివ్ రివ్యూలు హద్దులు దాటాయని అన్నారు.

Jyothika Responds to Kanguva Criticism

జ్యోతిక మాట్లాడుతూ, “కంగువలో కొన్ని లోపాలు ఉన్నాయన్న సంగతి నిజమే. కానీ ఆ సినిమాకు సంబంధించి మంచి విషయాలను ఎవరూ చెప్పడం లేదు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాకు ఎంతో మంది అహర్నిశలు శ్రమించి పనిచేశారని, ఆ కృషిని గుర్తించకుండా కేవలం లోపాల మీదే దృష్టి పెడతారని అన్నారు.

“నేను గతంలో ఎన్నో ‘చెత్త సినిమాలు’ (Bad Films) బాక్సాఫీస్ వద్ద హిట్ కావడాన్ని చూశాను. వాటిపై విమర్శలు వచ్చినా పెద్ద మనసుతో వదిలేస్తారు. కానీ సూర్య సినిమా మాత్రం ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటోంది. ఇది చాలా బాధకరమైన విషయం” అని జ్యోతిక అన్నారు.

కంగువ సినిమా విషయంలో ముఖ్యంగా సౌండ్ డిజైన్ (Sound Design) పై తీవ్ర విమర్శలు వచ్చాయి. సౌండ్ ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు సినిమా గందరగోళంగా ఉందని అభిప్రాయపడ్డారు. జ్యోతిక వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కొంతమంది ఆమెకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం రివ్యూలు అవసరమేనని అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *