KTR 50th birthday వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పండగలా మారాయి. అభిమానులు, BRS శ్రేణులు కలిసి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు జరిగాయి.
KTR 50th birthday service festivity
సిరిసిల్లలో బాలింతలకు KCR కిట్లు పంపిణీ చేయడంతో పాటు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ‘హ్యాపీ బర్త్‌డే రామన్న’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు. ఆపదలో ఆపద్భాందవుడిగా నిలిచే KTR అని అభిమానులు కొనియాడారు.
కరీంనగర్లో BRS నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఏడాదికి సరిపడా నోట్‌బుక్స్, పెన్నులు, స్టేషనరీ సామగ్రి పంపిణీ చేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కూరగాయల వ్యాపారులు, బాటసారులకు అల్పాహారం వితరణ చేశారు.
రామడుగులో తలసేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మాజీ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్ రెడ్డి, యువజన విభాగం మాజీ మండలాధ్యక్షుడు ఆరపెల్లి ప్రశాంత్ ఆధ్వర్యంలో 35 మంది రక్తదానం చేశారు. పార్టీ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు కూడా రక్తదానం చేశారు. చొప్పదండిలో BRS మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు బత్తిని సంపత్ ఆధ్వర్యంలో PHCలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి పంపిన నోట్‌బుక్స్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అందించారు.





