Kajal: గుడ్ న్యూస్.. మళ్లీ తల్లి కాబోతున్నకాజల్..?
Kajal: కాజల్ అగర్వాల్ సౌత్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కానీ తెలుగు ఇండస్ట్రీలోనే ఈమెకు అత్యంత ఆదరణ లభించింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ చందమామ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఆ తర్వాత టాప్ ఫైవ్ హీరోయిన్లలో ఒకరిగా మారింది.. ఈమె అంద చందాలు నటన అబినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది.
Kajal is going to be a mother again
అలాంటి కాజల్ తన కెరియర్ మంచి పొజిషన్ లో కొనసాగుతున్న సమయంలోనే తన చిన్ననాటి మిత్రుడు అయినటువంటి గౌతమ్ కిచులును ప్రేమించి వివాహం చేసుకుంది. అంతేకాదు తొందరలోనే ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే సాధారణంగా పెళ్లయిన తర్వాత చాలామంది హీరోయిన్స్ కొన్నేళ్లు గ్యాప్ తీసుకొని పిల్లలకు ప్లాన్ చేసుకుంటారు. కానీ కాజల్ మాత్రం అలాంటి పని చేయకుండా త్వరగానే బిడ్డకు జన్మనిచ్చింది. (Kajal)
Also Read: Prabhas: రహస్యంగా అనుష్కతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రభాస్.. ఫొటోస్ ఇక్కడ చూడండి.?
అంతేకాదు ప్రస్తుతం ఆమె తన బాడీ షేప్ అంతా సెట్ చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతుందట. ఇప్పుడున్న సినిమాలు అన్నింటిని కంప్లీట్ చేసి, కొత్త సినిమాలకి సంతకం చేయడం లేదట. దీనికి ఒక కారణం కూడా ఉందని తెలుస్తోంది. అది ఏంటయ్యా అంటే త్వరలో కాజల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతుందట.. అయితే ఆమె రెండవసారి కూడా ప్రెగ్నెంట్ అయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
అందుకే ఆమె సినిమా ఆఫర్లు వచ్చినా కానీ కమిట్ అవ్వడం లేదని, తనకు రెండవ సంతానమైన తర్వాత మళ్లీ సినిమాల్లోకి రావాలని చూస్తుందట. అయితే ఇద్దరు పిల్లలు పుడితే కంప్లీట్ గా పిల్లల విషయంలో కంగారు లేకుండా, ఇక సినిమాలపై దృష్టి పెట్టవచ్చని ఆమె రెండవ సంతానానికి కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏ సినిమా ఆఫర్ వచ్చిన ఒప్పుకోవడం లేదట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో అబద్ధం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ గా మారింది.(Kajal)