The role of the star actor who will continue in Kalki 2

Kalki 5th day collections: కల్కి 2898ఎడి మూవీ ఐదో రోజు బాక్స్ఆఫీస్ కలెక్షన్లు భారీగా తగ్గాయి. సోమవారం (జులై 1) కావటంతో ప్రభాస్, నాగ అశ్విన్ సినిమా కలెక్షన్లు పడిపోయాయి. ఇండియన్ సినిమా గతంలో ఎప్పుడూ చూడని ఓ భిన్నమైన స్టోరీ తో వచ్చి ఓ విజువల్ వండర్ గా నిలుస్తున్న కల్కి 2898 ఏడి మూవీ ఐదో రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు తగ్గాయి. అయినా మూవీ రేంజ్ కు తగినడ్లే కాస్త మెరుగైన కలెక్షన్లు వచ్చాయి. ప్రభాస్, దీపిక, అమితాబ్, కమల్ హాసన్ నటించిన ఈ కల్కి 2898 ఏడి మూవీ ఐదు రోజులు కలిపి ఇండియాలో ఏకంగా రూ.343 కోట్లు నెట్ కలెక్షన్లు సాధించింది. ఐదవ రోజు ఈ సినిమా ఇండియాలో రూ.34.6 కోట్లు వసూళ్లు చేసినట్లు sacnilk.com వెల్లడించింది.

నాలుగో రోజు అయిన ఆదివారం (జూన్ 30) ఈ కలెక్షన్లు రూ.88.2 కోట్లు కాగా..సోమవారం సగానికి సగం తగ్గాయి. అయితే ఐదవ రోజు తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్లు రావడం విశేషం. తెలుగులో ఈ మూవీకి రూ.14.5 కోట్లు రాగా..హిందీలో రూ.16.5 కోట్లు వచ్చాయి. తమిళంలో రూ.2 కోట్లు కన్నడలో రూ.03 కోట్లు, మలయాళం లో రూ.1.3 కోట్లు వసూలు చేసింది. తొలిరోజు ఇండియాలో రూ.95.3 కోట్లు వసూలు చేసిన కల్కి 2898 ఏడి మళ్లీ ఆ స్థాయి వసూళ్లు మాత్రం సాధించలేకపోయింది. నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్లకు పైగా వసూలు చేసిన ప్రభాస్ మూవీ.

Kalki 2898 AD: Prabhas fans ego hurt director .. what happened

ఫస్ట్ వీకెండ్ అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో జవాన్ (రూ.520 కోట్లు) మించిపోయింది. ఇప్పటికీ హిందీ బెల్ట్ లో కల్కి సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. సాధారణ ప్రేక్షకులే కాదు అక్కడి సెలబ్రిటీలు కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కల్కి 2898 ఏడి మూవీలో అశ్వత్థామ పాత్ర పోషించిన బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్ మొత్తానికి ఐదవ రోజు ఈ సినిమాను చూశాడు. ఈ విషయాన్ని అభిషేక్ బచ్చన్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. సోమవారం (జూలై 1) ఉదయయాన్నే తాము ఈ సినిమా చూస్తున్నట్లు చెబుతూ ఇది చూసిన తర్వాత తన మొదడు పేలిపోయిందన్నట్లుగా ఓ ఎమోజీ పోస్ట్ చేశాడు.