Kamal Haasan: మొదటి భార్యకు భరణం ఇచ్చి భారీగా నష్టపోయా.. కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్..?
Kamal Haasan: కమలహాసన్ ఇండియన్ చిత్ర పరిశ్రమల్లో ఈయన తెలియని వారు ఉండరు. పాన్ ఇండియా సినిమాలు రాకముందే పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు. కేవలం హీరో గానే కాకుండా దర్శకుడిగా, డాన్సర్ గా ఇలా అన్ని కోణాల్లో ఆయన రాణిస్తున్నారు. అలాంటి కమలహాసన్ సినీ పరిశ్రమలో ఎంతో పేరు తెచ్చుకున్నా కానీ తన సొంత లైఫ్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వాణి గణపతి తో ఆయన విడిపోయిన తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొన్నారట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..
Kamal Haasan Shocking comments on first wife
1960లో బాల నటుడిగా సినీ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన ఎన్నో జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో రాణిస్తున్న ఆయన 1978లో క్లాసికల్ నృత్యకారిని అయినటువంటి వాణి గణపతిని వివాహం చేసుకున్నారు. కానీ ఆమెతో ఆయన జీవిత కాలం గడప లేక పోయారు. ఆమెను పెళ్లి చేసుకునే సమయానికి సారికతో డేటింగ్ చేస్తూ, చివరికి వాణి గణపతికి విడాకులు ఇచ్చారు. ఆమెకు విడాకులు ఇచ్చిన టైం లోనే కమలహాసన్ కు పెళ్లి అంటే పూర్తిగా నమ్మకం పోయిందని అన్నారు.(Kamal Haasan)
Also Read; Sai Pallavi: “ఎల్లమ్మ”గా మెప్పించబోతున్న సాయి పల్లవి.. జోడి కుదిరేనా.?
ఒక ఇంటర్వ్యూలో కమలహాసన్ మాట్లాడుతూ వాణి గణపతితో పెళ్లి నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. నేను సంతోషంగా ఉండాలనుకొని ఆమె నుంచి విడిపోయాను. అందుకే సారికతో రిలేషన్ షిప్ పెంచుకున్నానని 1988లో చివరికి ఆమెనే పెళ్లి చేసుకున్నానని చెప్పారు. అంతేకాదు వాణి గణపతికి విడాకులు ఇచ్చిన తర్వాత కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉన్న కమలహాసన్ 2015లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వాణికి విడాకులు ఇచ్చిన తర్వాత తాను చాలా దివాలా తీసానని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో వాణి గణపతి మాట్లాడుతూ.. మాకు విడాకులు అయ్యి 28 ఏళ్ళు అవుతోంది.
నేను ఈ విషయాన్ని ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఇది చాలా వ్యక్తిగత విషయం మేమిద్దరం ఇప్పుడు విడిపోయాం, కానీ ఆయన ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో తెలియదని చెప్పుకొచ్చింది. మేము కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఇంటి నుంచి నేను ఒక్క వస్తువును కూడా నాకు ఆయన ఇవ్వలేదు. అలాంటి వ్యక్తి నుంచి నేను ఏమి ఆశించగలను. నేను ఆయనతో విడిపోయినప్పుడు ఆయనకు బాధ కలిగి ఉండవచ్చు కానీ ఆ తర్వాత చాలా జరిగింది. ఎవరి లైఫ్ లో వాళ్ళ బిజీ అయిపోయాం అంటూ చెప్పుకొచ్చింది. ఈ విధంగా వీరిద్దరు గతంలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Kamal Haasan)