Kamal Haasan: కమల్ హాసన్ టార్చర్.. సినిమా మధ్యలో వదిలేసి వెళ్లిన హీరోయిన్.?
Kamal Haasan: ఏంటి కమల్ హాసన్ టార్చర్ తట్టుకోలేక ఆ హీరోయిన్ సినిమా మధ్యలో నుండి వదిలి వెళ్ళిపోయిందా..మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు కమల్ హాసన్ వల్ల వదిలేసి వెళ్లిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం.. కమల్ హాసన్ మాజీ భార్య హీరోయిన్ సారిక అంటే తెలియని వాళ్ళు ఉండరు. సారిక ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.కానీ ఎప్పుడైతే కమల్ హాసన్‌తో ప్రేమలో పడిందో అప్పట్నుండి ఆమె చాలా వరకు సినిమాలకు దూరమైందట.

Kamal Haasan Torture that heroine
అయితే సారిక కంటే ముందే కమల్ హాసన్ వాణి గణపతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ఆమెని పెళ్లి చేసుకున్నాక కూడా చాలామంది హీరోయిన్ లతో కమల్ హాసన్ ఎఫైర్ పెట్టుకున్నట్టు వార్తలు వినిపించాయి. అందులో ఒకరే సారిక.. అలా సారిక కమల్ హాసన్ తో ప్రేమలో పడ్డ సమయంలో చాలాసార్లు ముంబై వదిలి, చెన్నైకి వచ్చేదట.(Kamal Haasan)
Also Read: Sneha Ullal: పెళ్లైన హీరోతో మళ్లీ పెళ్లి.. స్నేహ ఉల్లాల్ అంతకు తెగించిందా.?
అలా ఓసారి బాలీవుడ్ లో ఓ సీరియల్ చేస్తున్న సమయంలో సారికకి పదేపదే కమల్ హాసన్ కాల్ చేస్తూ మద్రాస్ కి రమ్మని చెప్పారట.దాంతో తన సీరియల్ ని కూడా పక్కనపెట్టి కమల్ హాసన్ మీద ప్రేమతో సారిక సీరియల్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయిందట.దాంతో సీరియల్ కోసం మరొకరిని తీసుకున్నామని సారిక మద్రాస్ కు చెందిన హీరోతో ప్రేమలో ఉండడం వల్లే నా సీరియల్ మధ్యలో వదిలేసి వెళ్ళింది.

కానీ ఆమె అలా వెళ్ళిపోవడం మంచిదే. ఎందుకంటే సారిక వెళ్లిపోవడంతో ఆ పాత్రలో అనురాధ పటేల్ ని తీసుకున్నాము. అలా అనురాధతో మంచి సాన్నిహిత్యం ఏర్పడి ఇద్దరం పెళ్లి కూడా చేసుకున్నాం అంటూ సీనియర్ నటుడు కన్వల్ జీత్ సింగ్ తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అయితే ఈ సీరియల్ మాత్రమే కాదు సారిక కమల్ హాసన్ తో ప్రేమలో పడి చాలా సినిమా అవకాశాలను కోల్పోయిందట. కానీ ఏం లాభం చివరి వరకు ఆయనతో కలిసి ఉండలేకపోయింది.(Kamal Haasan)