Kohli: కోహ్లీకి దెబ్బేసిన కేన్ మామ..!


Kohli: పాకిస్తాన్ లో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియంసన్ అజేయంగా 133 పరుగులు చేసి చరిత్ర తిరగ రాశారు. లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరిగిన రెండవ మ్యాచ్ లో ఈ అద్భుతమైన ప్రదర్శనతో బ్లాక్ క్యాప్స్ 305 పరుగుల లక్ష్యాన్ని చేదించింది. 14వ వన్డే సెంచరీ సాధించిన విలియంసన్ డెవాన్ కాన్వేతో కలిసి 187 పరుగులు భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ రికార్డ్ ను బీట్ చేశాడు.

Kane Williamson Breaks Virat Kohli’s Record

విలియంసన్ 7,000 వన్డే పరుగులు కూడా పూర్తి చేశాడు. అలా చేసిన రెండవ అత్యంత వేగవంతమైన ఆటగాడిగా నిలిచాడు. విలియంసన్ అద్భుతమైన సెంచరీ న్యూజిలాండ్ ట్రై- సిరీస్ లో ఫైనల్ కు అర్హత సాధించడంలో సహాయపడింది. ఈ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కివీస్ తరఫున విలియంసన్ వన్డే క్రికెట్ లో 7 పరుగులు చేసిన ఐదవ ఆటగాడిగా కూడా నిలిచాడు.

రాస్ టేలర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, మార్టిన్ గప్టిల్, నాదన్ ఆస్టిల్ జాబితాలో చేరాడు. విలియమ్సన్ కేవలం 159 ఇన్నింగ్స్ లలో ఈ అద్భుతమైన ఘనతను సాధించాడు. వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 7 పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. ఈ ప్రత్యేక జాబితాలో అతను విరాట్ కోహ్లీ కంటే ముందు వరుసలో ఉన్నాడు. ఇప్పుడు హషిమ్ ఆమ్లా కంటే వెనుకబడి ఉన్నాడు. అతను గప్టిల్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *