Kannappa Movie: వివాదంలో కన్నప్ప మూవీ.. పోస్టర్ పై హిందువులు ఫైర్.?
Kannappa Movie: ఏదైనా పురాణాల మీద దేవుళ్ల మీద సినిమా తీయాలి అనుకుంటే ఒకటికి వందసార్లు ఆలోచించాలి. ఎందుకంటే సినిమా విడుదలయ్యాక ఎన్నో వివాదాల్లో ఇరుక్కుంటారు.అలా ఇప్పటికే దేవుళ్ళ కథతో వచ్చిన చాలా సినిమాలు వివాదాల్లో ఇరుక్కున్నాయి.అయితే తాజాగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ అయిన కన్నప్ప కూడా వివాదంలో ఇరుక్కుంది. తాజాగా కన్నప్ప మూవీ నుండి కాజల్ అగర్వాల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

Kannappa Movie in controversy
ఈ పోస్టర్లో కాజల్ అగర్వాల్ పార్వతి దేవిగా కనిపిస్తోంది. ఇక మొదట్లో ప్రభాస్ శివుడిగా నయనతార పార్వతి దేవిగా కనిపిస్తుందని అన్నారు. కానీ తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తే మాత్రం పార్వతి దేవి పాత్రలో కాజల్ నటిస్తుంది అని అందరికీ అర్థమైంది. అయితే తాజాగా కన్నప్ప మూవీ నుండి విడుదలైన కాజల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ పై వివాదం నెలకొంది. పార్వతీదేవి గెటప్ లో ఉన్న కాజల్ పై చాలామంది హిందువులు ఫైర్ అవుతున్నారు. (Kannappa Movie)
Also Read: Suresh Nadia Relationship: సురేష్, నదియా రిలేషన్‌షిప్.. అప్పట్లో తెగ నడిచిందా?
హిందువుల మనోభావాలు దెబ్బతీశారు అంటూ కన్నప్ప మూవీ పై మండిపడుతున్నారు. మరి ఇంతకీ కన్నప్ప మూవీ నుండి రిలీజ్ చేసిన పార్వతి దేవి పోస్టర్లో ఉన్న తప్పేంటి అనేది చూస్తే..కాజల్ అగర్వాల్ పార్వతి దేవి పాత్రలో నటిస్తున్న కన్నప్ప మూవీకి సంబంధించిన పోస్టర్ తాజాగా రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్లో తెల్ల చీర కట్టుకొని మంచుకొండల మధ్యలో కూర్చున్న పార్వతీదేవి రూపంలో కాజల్ అగర్వాల్ మెరిసిపోతుంది.అయితే అన్ని బాగానే ఉన్నాయి

కానీ కాజల్ ని చూసి చాలామంది మోడ్రన్ కాజల్ అగర్వాలా.. దేవత రూపాన్ని మార్చేస్తున్నారు కదరా అంటూ చాలామంది హిందువులు ఫైర్ అవుతున్నారు.ఎందుకంటే కన్నప్ప మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్లో పార్వతి దేవి నుదుటిన బొట్టు కనిపించడం లేదు.దీంతో మోడ్రన్ పార్వతి దేవా అంటూ హిందువులు ఫైర్ అవుతున్నారు.మరి దీనిపై కన్నప్ప మూవీ యూనిట్ ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.(Kannappa Movie)