Kareena Kapoor: సైఫ్ ఘటన విషయం కరీనా వైఖరి తప్పు? ట్రోల్స్ కి సరైన సమాధానం!!
Kareena Kapoor: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు థానేలో అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత, సైఫ్ భార్య కరీనా కపూర్‌ను విమర్శిస్తూ అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ భార్య, రచయిత్రి ట్వింకిల్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kareena Kapoor targeted after Saif attack
సైఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కరీనా కపూర్ గురించి అనేక పుకార్లు వ్యాపించాయని ట్వింకిల్ ఖన్నా పేర్కొన్నారు. సైఫ్ దాడికి గురైనప్పుడు కరీనా ఇంట్లో లేరని, గాయాలతో బాధపడుతున్న సైఫ్‌కు ఆమె సహాయం చేయలేదని కొందరు ఆరోపించారు. ఇలా ఒక మహిళ గురించి మాట్లాడటం చాలా దారుణమని ట్వింకిల్ ఖన్నా అన్నారు.
విరాట్ కోహ్లీ సరిగ్గా ఆడనప్పుడల్లా అతని భార్య అనుష్క శర్మను కొందరు ట్రోల్ చేస్తారని ఆమె గుర్తు చేశారు. ఇలాంటి వారిని ఎలా ఎదుర్కోవాలని ఆమె ప్రశ్నించారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, సైఫ్‌పై దాడి చేసిన నిందితుడిని బాంద్రాలోని హాలిడే కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి అతనికి ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.