Karthikeya 3: ‘కార్తికేయ 3’ సీక్వెల్ పై క్లారిటీ..కొత్త దేవతా మిస్టరీ లో ట్విస్టులు!!

Karthikeya 3 Pre-Production & Shooting Details

Karthikeya 3: టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘కార్తికేయ 2’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించిన విషయం అందరికీ తెలిసిందే. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించగా, ఇందులోని మిస్టరీ థ్రిల్లర్ కథ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీకృష్ణుని చుట్టూ తిరిగే స్టోరీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇండియా మాత్రమే కాకుండా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేసింది.

Karthikeya 3 Pre-Production & Shooting Details

ఈ విజయంతో, ‘కార్తికేయ 3’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు చందూ మొండేటి గతంలోనే సీక్వెల్ ప్లాన్ గురించి సంకేతాలు ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం, ఆయన ప్రస్తుతం తండేల్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన వెంటనే ‘కార్తికేయ 3’ పై పూర్తి ఫోకస్ పెడతానని అధికారికంగా వెల్లడించారు. ఇంకా, ఈ సినిమాకు సంబంధించిన కథ ఇప్పటికే సిద్ధంగా ఉందని, ఇది కూడా శ్రీకృష్ణుని చుట్టూ తిరిగే ఇంటెన్స్ మిస్టరీ థ్రిల్లర్ గా ఉంటుందని తెలిపారు.

దీంతో ఈ సినిమాలో ఎలాంటి కథా వస్తువు ఉండబోతోంది? శ్రీకృష్ణునికి సంబంధించి మరెన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ కథలో చూపించబోతున్నారు? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ‘కార్తికేయ 3’ ఎప్పుడు ప్రారంభమవుతుందోననే కుతూహలం అభిమానుల్లో ఎక్కువైంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *