Kavati Manohar Naidu: వైసీపీకి షాక్…గుంటూరు నగర మేయర్ రాజీనామా ?
Kavati Manohar Naidu: వైసీపీకి షాక్…గుంటూరు నగర మేయర్ రాజీనామా చేయడం జరిగింది. తాజాగా మేయర్ పదవికి రాజీనామా చేశారు కావటి మనోహర్ నాయుడు. నగర కమిషనర్ తీరుకు నిరసనగా కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేయడం జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తునట్లు ప్రకటన చేశారు కావటి మనోహర్ నాయుడు. 2021లో గుంటూరు మేయర్ గా ఎన్నికైన మనోహర్ నాయుడు… పదవి పూర్తికాక ముందే… గుంటూరు నగర మేయర్ రాజీనామా చేయడం జరిగింది. దీంతో వైసీపీ పార్టీకి షాక్ తగిలింది.

Kavati Manohar Naidu resigns from the post of Mayor
ఇక ఈ సందర్భంగా కావటి మనోహర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను జగన్ వెంటే ఉంటానని ప్రకటించారు. నాపై ఎన్ని కేసులైనా పెట్టుకోండి నేను మాత్రం వైసీపీలోనే కొనసాగుతానని వెల్లడించారు. ఇన్ని అవమానాలు, ఇన్ని నిందలు తట్టుకోవడం ఇక నా వల్ల కాదని తెలిపారు. అందుకే మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను అంటూ ప్రకటించారు మనోహర్ నాయుడు. కనీసం మేయర్ ఛాంబర్ లో మంచి నీళ్లు ఇచ్చేవారు కూడా లేకుండా తీసేసారని ఫైర్ అయ్యారు. చాలా దారుణంగా, దుర్మార్గంగా నన్ను అవుమానించారని నిప్పులు చెరిగారు. గతంలో పని చేసిన మేయర్ లకు ఇలాంటి అన్యాయం జరగలేదన్నారు.
Also Read: Fennel Seeds: తిన్న తర్వాత వెంటనే సోంపు వేసుకుంటున్నారా…అయితే జాగ్రత్త ?
స్టాండింగ్ కమిటీలో బలం లేకున్నా కార్పొరేటర్ ఇళ్ల మీద పడి బజార్లో కూరగాయలు మాదిరిగా కుంటు స్టాండింగ్ కమిటీ మేము దక్కించుకున్నాం అంటుంటే హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేక రెండు సార్లు స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగిందని తెలిపారు కావటి మనోహర్ నాయుడు. గుంటూరు నగర అభవృద్ధి జరగాలి అని స్టాండింగ్ కమిటీలో పెట్టిన ప్రతిదీ ఆమోదం చేసామని… వైసీపీ సభ్యులను బెదిరించి,భయపెట్టి,డబ్బులిచ్చి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచారని వివరించారు. సంఖ్య బలంలో వైసీపీ వాళ్ళు ఉన్న మేయర్ క్యాండిడేట్ ని టీడీపీ అనౌన్స్ చేసి కైవసం చేసుకుంటాం అంటున్నారన్నారు.
Also Read: Pawan Kalyan: ఈ 11 ఏళ్ల వేడుకలు వైసీపీ 11కి అంకితం ?