Pawan Kalyan: పవన్ అనుకోకుండా Dy.CM అయ్యారు.. కవిత సంచలనం !
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కల్వకుంట్ల కవిత. తన కొడుకు అగ్ని ప్రమాదానికి గురైన బాధలు పవన్ కళ్యాణ్ ఉంటే.. అతన్ని ఉద్దేశించి.. గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ అనుకోకుండా డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడని ఆమె చురకలాంటించారు.

kavitha hot comments on pawan kalyan
హిందీ భాష నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కల్వకుంట్ల కవిత. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటిషియన్ కాదని గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందన ఏంటని ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయ్యారని ఆమె మండిపడ్డారు.
Also Read: Ghee: ఎండాకాలంలో నెయ్యి తింటున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే?
చేగువేరా ఆదర్శాలు నచ్చిన వ్యక్తి ఇప్పుడు బిజెపి మద్దతుదారుడిగా ఎలా మారాడని ఆమె ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ చేసే ప్రకటనలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయని రెచ్చిపోయారు. తమిళనాడు రాష్ట్రం వెళ్లి రేపు హిందీ ఇంపోజ్ చేయబోమనైనా ఆయన చెప్పవచ్చని ఆమె చురకలు అంటించారు. దీంతో ఒక కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో కవిత కామెంట్స్ వైర్లు అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ పై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగుతోంది. జనసేన పార్టీ నాయకులు ఆమెను ఉద్దేశించి.. మండిపడుతున్నారు.
Also Read: Telangana: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇక పై HSRP కొత్త నెంబర్ ప్లేట్లు