Kavitha: పింక్ బుక్ రెడీ చేస్తున్న కల్వకుంట్ల కవిత ?
Kavitha: పింక్ బుక్ లో అన్నీ రాసుకుంటున్నా..అంటూ కల్వకుంట్ల కవిత వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. లెక్కలు ఎలా రాయాలో మాకూ తెలుసు.. మీ లెక్కలు తీస్తామని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. జనగామ జిల్లాలో బీసీ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంటే కుదరదని తెలిపారు.

Kavitha is Preparing Pink Book
ఒక బిల్లు కాదు.. మూడు వేర్వేరు బిల్లులు పెట్టాలని డిమాండ్ చేశారు. విద్యలో 46 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు పెట్టాలన్నారు. ఉద్యోగాల్లో 46 శాతం రిజర్వేషన్లకు మరొక బిల్లు పెట్టాలని కోరారు. 42 శాతం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు కల్వకుంట్ల కవిత.
ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రాజకీయ రంగంలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరొక బిల్లును పెట్టాలని డిమాండ్ చేశారు కల్వకుంట్ల కవిత. బిల్లు పెట్టిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తేనే ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధ్యమవుతాయని తెలిపారు కల్వకుంట్ల కవిత. కానీ జాప్యం చేసి ఇతరులు కోర్టుకు వెళ్లేలా అవకాశం ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు నిర్దిష్టమైన సమాచారం ఉందని ఆగ్రహించారు.