Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన తర్వాత తీహార్ జైలులో ఉన్న సమయంలో కవితకు గైనిక్ సంబంధిత సమస్యలు ఏర్పడినట్లు సమాచారం. ఆ సమయంలో ఆమె చికిత్స తీసుకున్నారు. తాజాగా, మంగళవారం మరోసారి ఆస్పత్రిలో చేరడంతో, ఆమె వైద్య పరీక్షలకు అనుగుణంగా చికిత్స పొందుతున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.
Kavitha Return to Hospital Raises Concerns Over Health Issues
కవితకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఈరోజు ఆసుపత్రికి రావడం జరిగింది. సాయంత్రం వరకు ఈ పరీక్షలు పూర్తికానున్నాయని చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితి పట్ల అందరిలో ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే, ఈ సమయంలో ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండాలని ఆశిస్తున్నారు.
Also Read: Devara: బయటపడ్డ దేవర బాగోతం.. పైడ్ మాఫియా.. వీక్ డేస్ లో నో బుకింగ్స్!!
కవిత, లిక్కర్ స్కామ్ కేసులో ఐదు నెలలు జైలులో గడిపిన తర్వాత ఇటీవల సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చడంతో, జైలులోంచి విడుదల అయ్యారు. ఆమె జైలులో ఉన్న సమయంలో అనేక రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం, కవిత తన ఇల్లు మాత్రమే పరిమితమవుతూ, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం మానేశారు. ఆమె ఈ సమయంలో ఏ విధమైన రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండడం, తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రధానంగా గమనించవలసిన విషయం. ఈ సంఘటనతో కవిత రాజకీయాల్లో తిరిగి క్రియాశీలత ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉంటారా అన్నది చూడాలి.