KCR: తెలంగాణలో 10 ఉపఎన్నికలు రానున్నాయి ?
KCR: తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పది ఉప ఎన్నికలు రాబోతున్నట్లు ప్రకటన చేశారు కేసీఆర్. పార్టీ మారిన 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయని… ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీ జెండా ఎగరవేస్తుందని ప్రకటన చేశారు కేసీఆర్.

KCR Comments On By Elections
తాజాగా… స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. తో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో… కెసిఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉప ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.
పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయని ప్రకటన చేయడం జరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరికీ తెలంగాణ ప్రజలు సరైన బుద్ధి చెప్తారని వార్నింగ్ కూడా ఇచ్చారు. స్టేషన్ ఘనపూర్ లో ఉప ఎన్నిక వస్తుందని.. అక్కడ కడియం శ్రీహరి ఓడిపోయి రాజయ్య గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్.