KCR: వరంగల్ లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ
KCR: గులాబీ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు… రియంట్రీ ఇవ్వబోతున్నారు. మళ్లీ కదన రంగంలోకి దిగబోతున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఇందులో భాగంగానే వరంగల్ లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభను గులాబీ పార్టీ నిర్వహించబోతుంది.

KCR Huge public meeting with lakhs of people in Warangal
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని… ఈ సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫైర్ అయ్యారు. తాజాగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమై మాట్లాడారు. త్వరలోనే తాను కూడా రంగంలోకి దిగబోతున్నట్లు ప్రకటించారు.
ఇక గులాబీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా బ్రహ్మాండంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఈసారి జరిగే… అసెంబ్లీ సమావేశాలకు తాను కూడా హాజరవుతానని కేసీఆర్ ప్రకటించారట. ఎమ్మెల్సీ అభ్యర్థిపై కెసిఆర్ కసరత్తులు చేస్తున్నారు. తెలంగాణలో మళ్లీ మన ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని.. ఈ సందర్భంగా కెసిఆర్ ప్రకటించారు.