Keerthy Suresh and Anthony: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ ను మరింతగా పెంచుతున్న కీర్తి సురేష్!!
Keerthy Suresh and Anthony: కీర్తి సురేష్ హిట్టు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా “మహానటి” సినిమా తర్వాత ఆమెకు డెడికేటెడ్ ఫ్యాన్ బేస్ భారీగా ఏర్పడింది. సినిమా విజయం , పరాజయం ఎలా ఉన్నా, కీర్తి తన పాత్రలకు పూర్తి న్యాయం చేస్తుంది. ప్రస్తుతం గ్లామర్ డోస్ పెంచుతూ తన కెరీర్‌ను కొత్త దిశలో తీర్చిదిద్దుతోంది.
Keerthy Suresh and Anthony Viral Photos
అందుకు “బేబీ జాన్” సినిమా తాజా ఉదాహరణ. ఈ సినిమాలో “సురేష్ 2.0” లుక్ తో కీర్తి అందరికీ షాక్ ఇచ్చింది. సినిమా ఫ్లాప్ అయినా, కీర్తి సురేష్ గ్లామర్ మాత్రం బ్లాక్‌బస్టర్ అయింది. దీంతో బాలీవుడ్ లో కూడా ఆమె క్రేజ్ పెరుగుతోంది. పలు ప్రాజెక్ట్‌లు లైన్‌లో ఉండగా, పెళ్లి తర్వాత ఆమె కొత్త సినిమాల గురించి క్లారిటీ ఇవ్వలేదు.
ఇటీవల భర్త ఆంటోనీ తో హనీమూన్, ఫ్యామిలీ ఈవెంట్స్ లో బిజీ గా ఉన్న కీర్తి, సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్‌టైన్ చేస్తోంది. ఆమె పెళ్లి తర్వాత కెరీర్‌ను ఎలా ప్లాన్ చేసుకుంటుందో? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
సినిమాల విషయానికి వస్తే, ఇప్పటికే “రాణీ” మరియు “కన్నివేడి” సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే, కొత్త ప్రాజెక్ట్స్ గురించి కీర్తి సురేష్ స్వయంగా అనౌన్స్ చేయాల్సి ఉంది. అభిమానులు ఆమె నుంచి అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.