Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి చేసుకునే అబ్బాయి అంత రిచ్చా.. బలిసినోడినే పట్టిందిగా.?
Keerthy Suresh: కీర్తి సురేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ టెన్ హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. ఎన్నో చిత్రాల్లో నటించినటువంటి కీర్తి సురేష్ కు మహానటి ద్వారా మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమాలో ఆమె సావిత్రి పాత్రలో అచ్చం సావిత్రి ఎలా ఉండేదో ఆ విధంగా నటించి అందరినీ మెస్మరైజ్ చేసింది. అలాంటి కీర్తి సురేష్ కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే, చిన్ననాటి స్నేహితుడైనటువంటి ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
Keerthy Suresh is as rich as the boy she is marrying
అయితే తాజాగా కీర్తి సురేష్ తన సోషల్ మీడియా వేదికగా తాను వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నట్లు, 15 ఏళ్ల ప్రేమ గురించి వర్ణిస్తూ ఒక పోస్టు చేసింది. అంతే కాదు తన బాయ్ ఫ్రెండ్ తో దిగినటువంటి ఫోటోను కూడా షేర్ చేసింది. 15 ఏళ్ల మా ప్రేమ బంధం పెళ్లితో ఒక్కటి కాబోతోందని క్యాప్షన్ ఇవ్వడంతో కీర్తి సురేష్ స్నేహితులంతా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..(Keerthy Suresh)
Also Read: Dhanush takes legal action: నయన్ కు పదికోట్ల జరిమానా.. చిన్న తప్పవుకు కోర్టుకు ధనుష్!!
త్రిష, సంయుక్త మీనన్, నిక్కీ గల్డ్రని, అనుపమ పరమేశ్వరన్, అరుణ్ విజయ్ కుమార్, శ్రీకాంత్ ఓదెలా వంటి ఎంతోమంది స్టార్లు ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. కీర్తి పెళ్లి డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇదిలా ఉండగా ఆంటోనీ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈయన కేరళకు చెందిన వ్యక్తి అని, భారీగానే వ్యాపార సముదాయాలు ఉన్నాయని, విదేశాల్లో ఉద్యోగం చేసినటువంటి అంటోని, తర్వాత వ్యాపారాల్లో రాణిస్తూ కేరళలో చాలా బిజినెస్ లు పెట్టి కోట్ల రూపాయలు సంపాదించారని తెలుస్తోంది. ఇక ఈయన ఆస్తులు అన్ని కలిపి రూ:450 కోట్లకు పైగానే ఉంటుందని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న నేటిజన్స్ బలిసినోడినే పట్టింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Keerthy Suresh)