Keerthy Suresh: ఆస్తి కోసమే బిజినెస్ మ్యాన్ తో.. పెళ్లికి ముందే అలా చేస్తున్న కీర్తి సురేష్.?


Keerthy Suresh is doing this before marriage

Keerthy Suresh: తమిళ మీడియాలో తెలుగు మీడియాలో ఎక్కడ చూసినా కూడా కీర్తి సురేష్ పెళ్లి వార్తలే చక్కర్లు కొడుతున్నాయి.కీర్తి సురేష్ పెళ్లి వార్తలపై వస్తున్న రూమర్లపై ఎట్టకేలకు చెక్ పెట్టి పెళ్లి నిజమే అని క్లారిటీ ఇచ్చింది. తన చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి ఆంటోనీ తట్టిల్ తో దాదాపు 15 సంవత్సరాలుగా ప్రేమలో ఉందనే విషయాన్ని బయటపెట్టింది.

Keerthy Suresh is doing this before marriage

ఇక రీసెంట్గా తన బాలీవుడ్ మూవీ బేబీ జాన్ సినిమాకి సంబంధించి గుడ్ న్యూస్ తో పాటు తన పెళ్లి కూడా వచ్చే నెలలో జరగబోతుంది అంటూ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ గుడ్ న్యూస్ చెప్పింది.ఇక కీర్తి సురేష్ నోటి నుండి వచ్చిన గుడ్ న్యూస్ తో ఆమె అభిమానులు సందడి చేస్తున్నారు.ఇదిలా ఉంటే కీర్తి సురేష్ పై ఒక రూమర్ వినిపిస్తోంది. (Keerthy Suresh)

Also Read: Pushpa-2: పుష్ప-2 ఫ్లాప్ చేయాలని మెగా ఫ్యామిలీ కుట్రలు.. సీక్రెట్ ఆడియో కాల్ లీక్.?

అదేంటంటే.. కీర్తి సురేష్ చాలా ముందు జాగ్రత్తగా ఆలోచిస్తుందని,ఆమె చాలా బిజినెస్ మైండెడ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి కారణం ఏంటంటే.. కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే ఆంటోనీ తట్టిల్ పెద్ద బిజినెస్ మాన్ అనే సంగతి మనకు తెలిసిందే.అయితే పెళ్లికాకముందే తనకి కాబోయే భర్తకు సంబంధించిన బిజినెస్ లో సగం వాటా తనకు రాసివ్వాలని అగ్రిమెంట్ చేసుకుందట.

Keerthy Suresh is doing this before marriage

అయితే ఈ మ్యాటర్ కోలీవుడ్ లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ కీర్తి సురేష్ మామూలుది కాదు.చాలా బిజినెస్ మైండ్ తో ఆలోచిస్తుంది. పెళ్లి కాకముందే భర్త ఆస్తిలో సగం వాటా కొట్టేస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే తమిళ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది మాత్రం తెలియదు.(Keerthy Suresh)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *