Keerthy Suresh: ఆ హీరో తో కీర్తి సురేష్ పెళ్లి.. ముహూర్తం కూడా ఫిక్స్ చేశాక ఆగిపోయిందా.?

Keerthy Suresh: ఏంటి ఆ సీనియర్ హీరోతో కీర్తి సురేష్ పెళ్ళికి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యి క్యాన్సిల్ అయిందా.. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఎందుకు ముహూర్తం పెట్టుకున్నాక క్యాన్సిల్ అయింది అనేది ఇప్పుడు చూద్దాం.. కీర్తి సురేష్ తో సీనియర్ హీరో పెళ్లి అని వార్తల్లో ఉన్న ఆ హీరో ఎవరో కాదు నటుడు విశాల్.. ఈయన ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉంటున్నారు. అయితే ఈయనకి నటి అభినయ, ఐశ్వర్య లక్ష్మి,వరలక్ష్మి శరత్ కుమార్ వంటి హీరోయిన్లతో పెళ్లి అంటూ వార్తలు వినిపించాయి.
Keerthy Suresh marriage with that hero
ఇక రీసెంట్ గానే వరలక్ష్మికి పెళ్లి అయిపోయింది. అయితే గతంలో విశాల్ నటి కీర్తి సురేష్ ని గాఢంగా ప్రేమించారట. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సండకోజి 2 అంటే తెలుగులో పందెంకోడి 2 సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో కీర్తి సురేష్ ని విశాల్ ప్రేమించారట.కానీ ఈ విషయం ఆమెకి చెప్పలేదు. వన్ సైడ్ లవ్ చేశారట.మంచి అమ్మాయి అందగత్తె కావడంతో విశాల్ ఆమెను ను వదులుకోవాలి అనుకోలేదట.(Keerthy Suresh)
Also Read: Anitha: ముసలి బిజినెస్ మాన్ తో నువ్వు నేను మూవీ హీరోయిన్ ఎఫైర్.. నిజమేనా.?
దాంతో నేరుగా ఈ విషయాన్నీ కీర్తి సురేష్ పేరెంట్స్ కి చెప్పాలి అని నిర్ణయం తీసుకొని బ్రాహ్మణుడు దగ్గరికి వెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నాడట.ఆ తర్వాత కీర్తి సురేష్ ఇంటికి వెళ్లి మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని విశాల్ అడిగారట. కానీ అప్పటికే కీర్తి సురేష్ తన చిన్ననాటి ఫ్రెండ్ అయినటువంటి ఆంటోనీతో ప్రేమలో ఉండడంతో కీర్తి తల్లిదండ్రులు విశాల్ తో పెళ్లికి ఒప్పుకోలేదట.

దాంతో విశాల్ ఎన్నో ఆశలతో కీర్తి ఇంటికి వెళ్లి ఆమె ప్రేమ విషయం తెలిసి సైలెంట్ గా వచ్చేసినట్టు అప్పట్లో తమిళ మీడియాలో బాగా ప్రచారం జరిగింది.అయితే కీర్తి సురేష్ కి కేవలం విశాల్ తోనే కాకుండా శివ కార్తికేయన్, విజయ్,మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో కూడా డేటింగ్ వార్తలు చక్కర్లు కొట్టాయి.(Keerthy Suresh)