Keerthy Suresh: బంగారంతో పెళ్లి చీర నేయించుకున్న కీర్తి సురేష్ ..ఏకంగా 405 గంటలు..?
Keerthy Suresh: గత వారం రోజులుగా గోవాలో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న కీర్తి సురేష్ నిన్న అంటే ఆదివారం క్రిస్టియన్ పద్ధతిలో మరోసారి ఆంటోని తట్టిల్ ని క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం వైట్ కలర్ ఫ్రాక్ వేసుకొని పెళ్లి చేసుకుంది. ఇక అంతకుముందే అంటే డిసెంబర్ 12న హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లాడింది.ఇక ఈ పెళ్లిలో తెలుగుదనం ఉట్టిపడేలా కీర్తి సురేష్ కాంచీపురం పట్టుచీరలో మెరిసింది.
Keerthy Suresh who weaved a wedding saree with gold
అలాగే ఆంటోనీ తట్టిల్ కూడా పట్టు పంచె కట్టుకున్నారు.అయితే కీర్తి సురేష్ తన పెళ్లి చీరను చాలా స్పెషల్ గా డిజైన్ చేయించుకుందట.ముఖ్యంగా కీర్తి సురేష్ పెళ్లి చీర తయారు చేయడానికి ఏకంగా 405 గంటల సమయం పట్టిందట. అంతేకాదు తన భర్త ఆంటోని తట్టిల్ ధరించిన పట్టుపంచె చేయడానికి కూడా 150 గంటల సమయం పట్టిందట.(Keerthy Suresh)
Also Read: Prabhas: రహస్యంగా అనుష్కతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రభాస్.. ఫొటోస్ ఇక్కడ చూడండి.?
ఇక కీర్తి సురేష్ ప్యూర్ కాంచీపురం పట్టు చీరని నేయించుకుందట. ముఖ్యంగా ఈ చీర బార్డర్లో వచ్చిన గోల్డెన్ కలర్ లో ఉండే లేస్ పూర్తిగా బంగారం పెట్టే నేయించుకుందట. అలాగే ఆంటోనీ తట్టిల్ ధరించిన పట్టు పంచె లో కూడా బార్డర్ బంగారం తోనే వేయించారట. అలా పెళ్లి చీరల కోసం ఆంటోనీ తట్టిల్,కీర్తి సురేష్ బాగానే డబ్బు ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది.
ఇక వీరి పెళ్లికి సంబంధించిన పెళ్లి బట్టల గురించి ఎంతోమంది కీర్తి సురేష్ సన్నిహితులు కథలుకథలుగా మాట్లాడుకుంటున్నారు. ఇక కీర్తి సురేష్ సినిమాల ద్వారా ఆంటోనీ బిజినెస్ ద్వారా కోట్లు సంపాదించారు. కాబట్టి పెళ్లికి ఆ మాత్రం ఖర్చు చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు అంటున్నారు ఆమె ఫ్యాన్స్.(Keerthy Suresh)