Keshineni Nani: కేశినేని నాని రీ ఎంట్రీ.. టీడీపీ శ్రేణుల్లో వణుకు పుట్టిస్తున వార్త!!


Keshineni Nani political re-entry news

Keshineni Nani: విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని, రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కొన్ని నెలల తరువాత, ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఆయన తన సన్నిహితులతో సమావేశాలు నిర్వహించినట్టు టాక్ వినిపించింది. కొన్ని మీడియా సంస్థలు ఈ ప్రచారానికి తమ వంతు సహకారం ఇచ్చాయి, అలాగే కేశినేని నాని బీజేపీలో చేరబోతున్నారని పేర్కొన్నాయి.

Keshineni Nani political re-entry news

ఈ వార్తలపై కేశినేని నాని తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పష్టత ఇచ్చారు. ఆయన చెప్పినట్లుగా, 2023 జూన్ 10న ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించినట్లు పేర్కొన్నాడు. ఈ నిర్ణయం మారడం లేదని స్పష్టం చేసారు. ప్రజలకు సేవ చేయడం రాజకీయాల్లో ఉండకపోయినా సాధ్యమని ఆయన చెప్పినట్లు, రాజకీయ పార్టీలతో ముడిపడి తన సేవలు ఉండవని అన్నారు.

ప్రజా సంక్షేమం కోసం విజయవాడ ప్రజలకు తన సేవలను నిరంతరం కొనసాగిస్తానని కేశినేని నాని తెలిపారు. రాజకీయ రీ ఎంట్రీ విషయంలో వచ్చిన రూమర్లను ఖండించారు. ఆయ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రకటించారు.

కేశినేని నాని 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన తర్వాత, 2014 మరియు 2019లో టీడీపీ తరఫున విజయవాడ ఎంపీగా గెలిచారు. 2024లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన తరువాత, ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *