Jana Reddy: తెలంగాణ ప్రభుత్వంలో జానా రెడ్డికి కీలక పదవి?
Jana Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో…. మాజీ మంత్రి జానారెడ్డికి కీలక పదవి రాబోతుందట. తాజాగా… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా వెళ్లి జానారెడ్డిని కలిశారు. కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్న జానారెడ్డి ఇంటికి…. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి ప్రత్యేకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కీలక పదవి ఇవ్వడం పైన చర్చించారట.

Key Post For Jana Reddy in Telangana Govt
రాజకీయాల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి జానారెడ్డి. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా కీలక పాత్ర పోషించారు. కానీ కెసిఆర్ తరహాలో తెలంగాణ సాధించలేకపోయారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వం తొలిసారి ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష నాయకులుగా… తన వంతు కృషి చేశారు.
కాంగ్రెస్ లో బడా నేత. ముఖ్యమంత్రి అయ్యే క్యాండిడేట్. కానీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా తన కొడుకును బరిలోకి దింపారు జానారెడ్డి. ఈ తరుణంలోనే ఇద్దరు కొడుకులకు పదవులు కూడా వచ్చాయి. రాజకీయాలకు గుడ్ బై చెప్పే సమయంలో ఆయనకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి.. పావులు కదుపుతున్నారట.