Kiran Abbavaram: పాన్ ఇండియా హిట్ తో రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కిరణ్ అబ్బవరం..?

Kiran Abbavaram: తెలుగు ఇండస్ట్రీలో హీరోగా రాణించడం అంటే మామూలు విషయం కాదు.. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కానీ సరైన నటన టాలెంటు, అభిమానుల ఆదరణ లేకపోతే రాణించడం కష్టం.. ఎవరైతే సొంత టాలెంట్ నమ్ముకొని సరైన కథ నేర్చుకుంటూ యూత్ కు తగ్గట్టుగా సినిమాల్లో దూసుకుపోతారో వారే సక్సెస్ కాగలుగుతున్నారు. అలా చెప్పుకోవడానికి తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోలే ఉన్నారు.. ఇప్పుడు అదే కోవలో వస్తున్నారు కిరణ్ అబ్బవరం..

Kiran Abbavaram who increased his remuneration

Kiran Abbavaram who increased his remuneration

కొన్ని ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. క అనే చిత్రం ద్వారా మంచి హిట్ అందుకొని తన కెరియర్ ను గాడిలోకి తీసుకెళ్లారు. అలాంటి కిరణ్ అబ్బవరం ఖాతాలో ఈ ఒక్క చిత్రం హిట్టు పడగానే తన పారితోషికం 5కోట్ల వరకు పెంచారట.. అయితే ఆయన మార్కెట్ కూడా గాడిలో పడడంతో తాను అడిగింది కూడా ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కిరణ్ అబ్బవరం చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాల వరకు ఉన్నట్టు తెలుస్తోంది. (Kiran Abbavaram)

Also Read: Vishwambhara Movie: “విశ్వంభర” పైనే మెగా ఫ్యాన్స్ ఆశలు.. విడుదల తేదీ తో మరింత పెరుగుతున్న ఒత్తిడి..!!

ప్రస్తుతం ఆయన దండా నిర్మాణంలో ఒక సినిమా ఎస్ కె ఎన్ సాయి రాజేష్ బ్యానర్ లో ఒక సినిమా, అలాగే క2 చిత్రంతోపాటు మరో రెండు ప్రాజెక్టులను కూడా సెట్ చేసుకొని పెట్టుకున్నారట.. ప్రస్తుతం ఆయన దిల్ రుబా అనే చిత్రంతో ఫిబ్రవరిలో మన ముందుకు రాబోతున్నారు.. అయితే కిరణ్ అబ్బవరంను దర్శక, నిర్మాతలు నమ్మడానికి మరో కోణం కూడా ఉందట. దర్శక నిర్మాతలు ఏదైనా కథలోని పాయింట్ చెబితే దానికి సంబంధించి కథను మరింత డెవలప్ చేసుకుంటారట.

Kiran Abbavaram who increased his remuneration

ఇలా కథల విషయంలో డైరెక్టర్లకు పెద్దగా ఇబ్బంది అనిపించదని చెప్పుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో కిరణ్ అబ్బవరం ఆయన సినిమాలకి ప్రమోషన్స్ కూడా ఎక్కువగానే చేసుకుంటున్నారు. దీనివల్ల సినిమాకు అన్ని విధాలా కలిసి వస్తుందని కిరణ్ ను హీరోగా తీసుకోవడానికి దర్శక,నిర్మాతలు కూడా ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ దిల్ రుబా సినిమా కూడా హిట్ అయితే మాత్రం కిరణ్ అబ్బవరం కెరియర్ కు ఇక ఇబ్బందులు ఉండవని అంటున్నారు.(Kiran Abbavaram)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *