KL Rahul : జస్ప్రీత్ బుమ్రా భార్య కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కే ఎల్ రాహుల్!!

KL Rahul: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు విజయం మాత్రమే కాకుండా, కేఎల్ రాహుల్ మరియు సంజన గణేషన్ మధ్య సరదా సంభాషణ కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఇండియా టైటిల్ గెలిచిన తర్వాత, రాహుల్ తన చమత్కారపు సమాధానంతో అభిమానులను కడుపుబ్బ నవ్వించాడు.
KL Rahul Viral Interview with Sanjana
సంజన గణేషన్ రాహుల్‌ను ఇంటర్వ్యూలో, “ఈ భయానక స్పిన్ వేసేప్పుడు వికెట్ల వెనక ఉండడం ఎంత సవాలు తో కూడుకున్నది అని ప్రశ్నించగా, రాహుల్ సరదాగా స్పందిస్తూ, “సంజన, సరదా కాదు! ఈ స్పిన్నర్లు బౌలింగ్ చేస్తున్నప్పుడు నేను 200-250 సార్లు స్క్వాట్ చేయాల్సి వచ్చింది.” అని చెప్పాడు. అతని నిజాయితీతో కూడిన జవాబు ఫ్యాన్స్‌ను కడుపుబ్బ నవ్వించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే, రాహుల్ ఛాంపియన్స్ ట్రోఫీ లో చేసిన ప్రదర్శన కు ప్రతి ఒక్కరు ముగ్దులయ్యారు. బ్యాట్‌తో పాటు వికెట్ కీపింగ్‌లోనూ అతను అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. రిషబ్ పంత్ నుంచి పోటీ ఎదుర్కొన్నప్పటికీ, తన స్థిరమైన ప్రదర్శనలతో జట్టు మేనేజ్మెంట్ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు. DRS కాల్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మకు సహాయపడిన రాహుల్, కీలక క్షణాల్లో చక్కటి సంయవనం చూపించి జట్టుకు విలువైన ఆస్తిగా మారాడు.
టోర్నమెంట్లో నాలుగు ఇన్నింగ్స్‌లలో 140 పరుగులు చేసి, 140 అద్భుత సగటు మరియు 97.90 స్ట్రైక్ రేట్‌తో ముగించాడు. సెమీఫైనల్లో అతని అజేయ 42 పరుగులు, ఫైనల్లో 34 పరుగులు గెలుపుకు కీలకం అయ్యాయి. ఈ ప్రదర్శనతో రాహుల్ ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’లో చోటు దక్కించుకున్నాడు. అద్భుత ప్రదర్శన ఇచ్చిన రాహుల్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో హైలైట్‌గా నిలిచారు.