Komatireddy: నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ కే నష్టం?
Komatireddy: తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్కే నష్టమ అంటూ… తన అనుచరులతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా… తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ… పైన అనేక రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. అధిష్టానం క్లియరెన్స్ ఇస్తే తప్ప తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరగదు. అటు రాహుల్ గాంధీ అసలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో… తెలంగాణ మంత్రి పదవి కోసం ఆశావాహులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

KOMATIREDDY ON MINISTER POST
ఈ లిస్టులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఆయన ఏ పార్టీలో ఉన్న.. మునుగోడు నియోజకవర్గం నుంచి గెలవడం ఖాయం అని చాలా సార్లు రుజువు చేశారు. ఏ పార్టీలో ఉన్న ప్రజాసేవ కోసం పనిచేస్తూ ఉంటారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే తనకు మంత్రి పదవి కావాలని చాలాసార్లు కాంగ్రెస్ ముందు డిమాండ్ పెట్టారట. తాజా సమాచారం ప్రకారం… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాదని తెలుస్తోంది. ఇప్పటికే నల్గొండ జిల్లాకు చాలా పదవులు వచ్చాయని… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రి పదవి ఉందని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించిందట.
అందుకే రాజగోపాల్ రెడ్డికి పదవి ఇవ్వబోదని తెలుస్తోంది. ఇలాంటి ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సన్నిహితులతో సంచలన వ్యాఖ్యలు చేశారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నాకు మంత్రి పదవి వస్తే కాంగ్రెస్ పార్టీకే లాభం అంటూ ఆయన బాంబు పేల్చారు. 2018 సంవత్సరంలో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే బిజెపి కి అలాగే బిజెపి నుంచి నేను పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిద్రాహారాలు మాని భువనగిరి సీటు గెలిపించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.