Krishna Vamsi: ఆర్జీవితో కృష్ణవంశీకి గొడవలు.. మొహం కూడా చూడడం లేదా.?
Krishna Vamsi: తెలుగు ఇండస్ట్రీలో అత్యంత పాపులర్ డైరెక్టర్లలో కృష్ణవంశీ ఒకరు. ఈయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు డైరెక్షన్ చేసి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. అలాంటి కృష్ణవంశీ రాంగోపాల్ వర్మ శిష్యుడే అని చాలామందికి తెలియదు. ఆయన వద్ద పనిచేసి చివరికి రామ్ గోపాల్ వర్మకు దీటుగా సినిమాలు తీసి డైరెక్షన్ లో ఎదిగారు.. ఒకప్పుడు వీరిద్దరూ చాలా ఆత్మీయంగా ఉండేవారు..

Krishna Vamsi has quarrels with RGV
కానీ కృష్ణవంశీ చేసిన సినిమాలు కాస్త హిట్ అవ్వడంతో రాంగోపాల్ వర్మ అంటే ఏంటి అనే విధంగా తయారయ్యాడని సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపించాయి.. వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని చాలామంది అనుకుంటారు.. నిజానికి వీరి మధ్య విభేదాలు వచ్చాయా?ఇంకేమైనా జరిగిందా అనే విషయాలను ఒక ఇంటర్వ్యూలో కృష్ణవంశీ బయటపెట్టారు.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. తెలుగు ఇండస్ట్రీలో ఆర్జీవి అంటే ఒక స్పెషల్ అని చెప్పవచ్చు.. (Krishna Vamsi)
Also Read: Chhaava Movie: ఛావా మూవీలో రష్మిక చేసిన బిగ్ మిస్టేక్.. ఎవరైనా గమనించారా.?
ఆయన ఒకప్పుడు ‘శివ’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా కొనసాగారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో ఆయన సినిమాల్లో చాలా డల్ అయిపోయారు. అలాంటి రాంగోపాల్ వర్మతో ఒక చిన్న ఇష్యూ వల్ల డైరెక్టర్ కృష్ణ వంశీ దూరమయ్యారట. వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో పనిచేస్తున్న సమయంలో నేను ఇలా చేద్దాం అంటే ఆయన మరో రకంగా చేద్దామని అన్నారు. దీంతో మా ఇద్దరి మధ్య కాస్త విభేదం ఏర్పడింది. ఇక అప్పటినుంచి మేమిద్దరం దూరం అయిపోయామని చెప్పుకొచ్చారు..

ఇక విభేదాలు ఎప్పుడైతే వచ్చాయో ఆ తర్వాత నేను సొంతంగా సినిమాలు తీయడం మొదలుపెట్టాను నేను తీసిన సినిమాలు చాలా వరకు సూపర్ హిట్ అవుతూ వచ్చాయి. దీంతో రాంగోపాల్ వర్మ నాతో మాట్లాడి చాలా సూపర్ గా సినిమాలు తీస్తున్నావని అప్రిషియేట్ చేశారు.. ఇది తప్ప మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని కృష్ణ వంశీ క్లారిటీ ఇచ్చారు. ఇక కృష్ణవంశీ తీసిన సినిమాల విషయానికి వస్తే మురారి, చందమామ, గోవిందుడు అందరివాడేలే, ఖడ్గం, డేంజర్, రంగమార్తాండ, వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలను అందించాడు.(Krishna Vamsi)