Telangana: కాంగ్రెస్ ఏడాది పాలనపై సంచలన సర్వే.. రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగలనుందా ?
Telangana: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. అయితే ఈ ఏడాది కాలంలో.. అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం…. విమర్శలకు తావులేపింది. ఒక ప్రభుత్వం ఏర్పడితే దాదాపు మూడు సంవత్సరాల వరకు ఎక్కడ వ్యతిరేకత అనేది కనిపించదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు అయిన తర్వాత… ఏడాది తిరగకముందే ముసలం నెలకొంది. Telangana

Ktr Comments On Revanth reddy Govt
కాంగ్రెస్ నేతలు జనాల్లోకి వెళితే ప్రస్తుతం కొట్టే పరిస్థితి ఉందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. కెసిఆర్ అప్పులు చేసినప్పటికీ రైతుబంధు, ఆసరా పెన్షన్లు టైం టు టైం అందజేశాడని… కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాటికి పంగనామాలు పెట్టారని ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడినట్లు చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో… కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక వ్యక్తి.. రేవంత్ రెడ్డి ఏడాది పాలన పైన సర్వే చేశాడట. Telangana
Also Read: Telangana Thalli: తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం..బతుకమ్మ ఎక్కడా ?
దాదాపు 68,000 మంది శాంపిల్స్ సేకరించాడట. అయితే ఇందులో షాకింగ్ నిజాలు బయటపడినట్లు సమాచారం. ఏడాది లోపే కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఉందట. ఇప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం గ్యారెంటీ అని ఆ సర్వేలో తేలిందట. అయితే ఈ విషయాన్ని స్వయంగా గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలపడం జరిగింది. ఈ సర్వే రిపోర్ట్ తో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉలిక్కిపాటు ఏర్పడింది. Telangana