KTR: కేటీఆర్ పై రేవంత్ కేసులు.. 10 కోట్లు ప్రజాధనం వృధా ?
KTR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసరడం జరిగింది. రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే లై డిటెక్టర్ పరీక్షకు ముందుకు రా అంటూ సవాల్ విసిరారు కల్వకుంట్ల తారక రామారావు. తాజాగా ఈడీ విచారణ ఎదుర్కొన్న కేటీఆర్… రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
KTR Formula E Car Race Cm revanth reddy
ఈ విచారణకు దాదాపుగా రూ.10 కోట్లు ఖర్చు అవుతుంది.. అందుకే రేవంత్ రెడ్డికి నేను ఒకమాట చెప్తున్నా అంటూ బాంబు పేల్చారు కేటీఆర్. మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా.. మీ మీద ఏసీబీ, ఈడీ కేసులు అయ్యాయి కాబట్టి నా మీద కూడా అవే కేసులు బనాయించావు? అంటూ మండిపడ్డారు కేటీఆర్.
Also Read: Ashwin Pension: వినోద్ కాంబ్లీ కంటే.. ఎక్కువ పెన్షన్ తీసుకుంటున్న అశ్విన్?
ఈ వృధా అవుతున్న రూ.10 కోట్ల ప్రజా ధనంతో ఇంకా 500 మందికి రుణమాఫీ చేయొచ్చు.. అందుకే డబ్బులు వృధాకాకుండా లై డిటెక్టర్ పరీక్ష పెట్టు అంటూ సవాల్ విసిరారు. లై డిక్టెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. నువ్వు కూడా రా అంటూ ఛాలెంజ్ చేశారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో.. డేట్, టైం, ప్లేస్ నువ్వే చెప్పు.. నేను వస్తా అన్నారు కేటీఆర్.