Manchu Family: మంచు ఫ్యామిలీ గొడవల వెనుక కేటీఆర్ హస్తం.. మంచు లక్ష్మి బయట పెట్టిన నిజం..?
Manchu Family: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మంచు కుటుంబం గురించే చర్చించుకుంటున్నారు. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తం ఈ గొడవ వల్ల రోడ్డు మీద పడింది. ఇన్నాళ్లు కాపాడుకున్న పరువంతా పోయిందని చెప్పవచ్చు.. ఇదే తరుణంలో కోపం తెంచుకున్నటువంటి మోహన్ బాబు మీడియాపై కూడా దాడి చేశారు. దీంతో మీడియా ప్రతినిధులు ఇతర రాజకీయ నాయకులు అంతా మోహన్ బాబుపై విరుచుకుపడి కేసులు కూడా పెట్టేశారు.
KTR hand behind Manchu Family quarrels
మోహన్ బాబు వ్యవహారం చిలికి చిలికి గాలి వాన మారిన తరుణంలో, ఈ గొడవకు కారణం కేటీఆర్ అంటూ సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు వార్తలు రాస్తూ వస్తున్నారు. మరి దీనికి కేటీఆర్ కు సంబంధం ఏంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. బీఆర్ ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయిందో అప్పటినుంచి వారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కొంత మంది సోషల్ మీడియా వేదికగా వార్తలు రాస్తూ వస్తున్నారు. (Manchu Family)
Also Read: Bigg Boss8: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలేకి గెస్ట్ గా అల్లు అర్జున్.. ఆ రికార్డ్స్ బ్రేక్..?
ఈ మధ్యకాలంలో మంత్రి కొండా సురేఖ సమంతాకు కేటీఆర్ కు సంబంధం ఉందని చెప్పి పెద్ద బాంబు పేల్చింది. ఈ క్రమంలోనే ఫోన్ టాపింగ్ కేసుల్లో రకరకాల వ్యవహారాల్లో కేటీఆర్ ను ఇరికిస్తూ కేసులు పెడుతూ వస్తున్నారు. ఇదే తరుణంలో కొంతమంది సోషల్ మీడియా వ్యక్తులు మంచు మనోజ్ మోహన్ బాబు గొడవకు కారణం కేటీఆర్ అని, వారిద్దరి ఫోన్లు టాప్ చేసి వారి మధ్య కేటీఆర్ గొడవ పెట్టించారని వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ విషయాన్ని మంచు లక్ష్మి చెప్పినట్టు వారు వార్తలు రాస్తూ వస్తున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా మాత్రం విపరీతంగా వైరల్ చేస్తుంది. దీనిపై వెంటనే స్పందించిన గులాబీ శ్రేణులు అదంతా ఫేక్ అంటూ, కావాలని కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు కేటీఆర్ పై బురద జల్లుతున్నారని, ఒక ఇంటి వ్యవహారాన్ని కేటీఆర్ కు అంటగట్టడం సమంజసం కాదని కౌంటర్లు విసురుతున్నారు. ఏది ఏమైనా ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయిందని చెప్పవచ్చు.(Manchu Family)