KTR: ఫార్ములా-ఈ రేస్…ఇరుకున్న రేవంత్ రెడ్డి..?
KTR: ఫార్ములా-ఈ రేస్ అంశంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫార్ములా-ఈ రేస్ అంశంలో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఇరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేటీఆర్ వేసిన స్కెచ్ తో…తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఇరుక్కుపోయారని చెప్పవచ్చు. దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టండి అంటూ కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. KTR
KTR letter over e formula race to revanth reddy
ఇందులో భాగంగానే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. దీంతో.. ఫార్ములా-ఈ రేస్ అంశంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం పారదర్శకంగా జరిగినా.. ఏదో జరిగినట్లు అపోహలు సృష్టిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. KTR
Also Read: Tendulkar-Kambli: 70 వేలు రావాల్సిన పెన్షన్ 30 వేలే ఎందుకు వస్తున్నాయి.. సచిన్ కుట్ర చేశాడా ?
ఈ రేస్ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి 700 కోట్ల ఆదాయం సమకూరినట్లు నీల్సన్ సంస్థ స్పష్టం చేసిందని గుర్తు చేశారు కేటీఆర్. ఈ వ్యవహారంపై కేబినెట్‌లో గంటన్నరపాటు చర్చించినట్లు వార్తలు వస్తున్నాయన్నారు కేటీఆర్. మీడియా ద్వారా అనేక అవాస్తవ కథనాలను సైతం ప్రసారం చేయిస్తున్నారని ఆగ్రహించారు. అందుకే ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టండి.. నిజాలేంటో అందరికీ తెలుస్తాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. KTR