Sundar C: పెళ్లికి ముందే ఆ హీరోయిన్ తో ప్రేమ.. కుష్బూ భర్త షాకింగ్ కామెంట్స్.?
Sundar C: చాలామంది ఇండస్ట్రీలో ఉండే దర్శకులు, నిర్మాతలు, హీరోలు హీరోయిన్లతో లవ్ లో పడుతూ ఉంటారు. కొంతమంది వీరి లవ్ లను హీరోయిన్లకు చెప్పకుండా వన్ సైడ్ గానే లవ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగానే ఈ దర్శకుడు కూడా అలనాటి హీరోయిన్ ను విపరీతంగా లవ్ చేసి కనీసం ఆమెకు ప్రపోజ్ కూడా చేయలేదు. తన లవ్ ను వన్ సైడ్ గా దాచుకున్నారు.
Kushboo Husband Sundar C Love with that heroine before marriage
కానీ ఆయన చివరకు కుష్బూతో లవ్ లో పడి ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే తమిళ్ స్టార్ డైరెక్టర్ సుందర్ సి. కామెడీ చిత్రాలకు పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన తీసిన సినిమాల్లో విన్నర్, కళాకళప్పు, ఉలత్తయ్ అల్లిత్త, అరుణనై వంటి అద్భుతమైన హిట్ చిత్రాలను అందించారు. ఇంకా ఇవే కాకుండా హర్రర్ చిత్రాలకు కూడా మంచి డైరెక్షన్ అందిస్తారు.(Sundar C)
Also Read: Anushka: జైలు జీవితం గడపాల్సిన అనుష్క.. కేసు నుండి ఎలా బయటపడిందటే.?
తాజాగా ఈయన డైరెక్షన్ లో గ్యాంగ్ స్టార్ అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో సుందర్ సి హీరోగా చేస్తున్నారట. అంతేకాదు కుష్బూ ఈ సినిమాకు నిర్మాతగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అలాంటి ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లవ్ స్టోరీ గురించి బయట పెట్టారు. నాకు అప్పట్లో ఒక నటిపై తీవ్రమైన క్రష్ ఉండేదని, ఆమెతో ఒక్కసారైనా అప్పట్లో పని చేయాలనుకున్నాను కానీ కుదరలేదని చెప్పారు.
ఇంతకీ ఆవిడ ఎవరయ్యా అంటే హీరోయిన్స్ సౌందర్య అని అన్నారు. ఆవిడంటే నాకు ఎంతో ఇష్టం అప్పట్లో చాలా లవ్ చేశాను. ఒకవేళ కుష్బూ నా జీవితంలోకి రాకపోతే ఆమెకు ప్రపోజ్ చేసే వాడిని ఆమె ప్రేమను ఎలాగైనా పొందేవాడిని అంటూ చెప్పుకోచ్చారు. ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.(Sundar C)