Lady Aghori: లేడీ అఘోరికి భార్య ఉందా… ఓ యువతి సంచలన ఆరోపణలు ?
Lady Aghori: లేడీ అఘోరి.. గత కొన్ని రోజులుగా మీడియా ఛానల్లో బాగా పాపులర్ అయింది. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు కచ్చితంగా లేడీ అఘోరి వార్త వస్తోంది. హిమాలయాల నుంచి హిందూ దేవాలయాలను కాపాడేందుకు వచ్చానని నాన రచ్చ చేసింది ఈ లేడీ అఘోరి. ముఖ్యంగా వేములవాడ రాజన్న సన్నిధిలో ఉన్న… ముస్లిం సమాధిని తొలగిస్తానని కూడా రచ్చ చేసింది.

Lady Aghori case update
అలాగే వర్షిని అనే అమ్మాయిని తనతో తీసుకువెళ్లి.. మరో విభాగానికి తెరలేపింది లేడీ అఘోరి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే లేడీ అఘోరి తన భర్త అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఓ యువతి. అతని మొదటి భార్యను నేనే అంటూ యువతి మీడియా.. ముందుకు రావడం జరిగింది. తమ పెళ్లి జనవరి ఒకటో తేదీన జరిగిందని ఈ సందర్భంగా ఆ యువతి లేడీ అగోరిపై ఆరోపణలు చేయడం జరిగింది.
KCR: కెసిఆర్ సభ… దిగివచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ?
తనను వదిలేసిన అనంతరం వర్షిని అనే అమ్మాయిని అఘోరీ పెళ్లి చేసుకున్నట్లు తనకు తెలిసిందని గుర్తు చేసింది. వాళ్ళిద్దరూ గుజరాత్ వెళ్లినట్లు కూడా తెలిపింది. ఈ విషయం తెలియగానే తాను బయటికి వచ్చినట్లు వివరించింది. ఈ విషయంలో తనకు మీడియా అలాగే పోలీసులు అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది బాధిత యువతి. మరి ఈ లేడీ అఘోరి వ్యవహారంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Vijayasaireddy: మరోసారి రాజ్యసభకు విజయసాయిరెడ్డి.. ప్లానంత జగన్ దేనా ?