Laila: భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న లైలా..ఒక్క నిమిషం కూడా అలా చేయకుండా ఉండలేదట.?


Laila: తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు వారి నటన టాలెంట్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో లైలా కూడా ఒకరు.. ఈమె అప్పట్లో సినిమాల్లో వస్తుంది అంటే యూత్ థియేటర్లకు ఎగబడి వెళ్లేవారు. అలాంటి లైలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతకాలంలోనే మంచి గుర్తింపు పొంది పలువురు స్టార్ హీరోలో సరసాన నటించింది. కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది.

Laila is suffering from a terrible disease

Laila is suffering from a terrible disease

అయితే లైలా ఇండస్ట్రీకి దూరమై కొన్ని సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ చెరగని అందంతో 18 ఏళ్ల పాపలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 44 ఏళ్ల పైగానే ఉంది. అయినా ఈ అమ్మడు అందం ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. అయితే ఈమె తన 14 ఏళ్ల చిన్న కొడుకును తీసుకొని ఎప్పుడైనా రోడ్డుపైకి వెళితే మీ బాయ్ ఫ్రెండా అని చాలామంది అడుగుతారట.(Laila)

Also Read: Dhanush: అజిత్ కోసం ధనుష్ త్యాగం చేశాడా? పోస్ట్ పోన్ అయిన భారీ రిలీజ్ ప్లాన్!!

దీన్ని బట్టి చూస్తే లైలా ఎంత అందంగా ఉందో అర్థం చేసుకోవచ్చు..అలాంటి ఈ సీనియర్ బ్యూటీకి ఒక వింత వ్యాధి ఉందట.. దీనివల్ల ఆమె అనేక ఇబ్బందులు పడుతుందట..ఇంతకీ ఆ వ్యాధి ఏంటయ్యా అంటే.. ఒక్క నిమిషం కూడా నవ్వలేక ఉండకపోవడం.. లైలా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది.. శివపుత్రుడు సినిమా షూటింగ్ సమయంలో విక్రమ్ నువ్వు ఒక 30 సెకండ్లు నవ్వకుండా ఉండు అంటూ చాలెంజ్ చేశారట..

Laila is suffering from a terrible disease

లైలా 30 సెకండ్లు నవ్వకుండా ఉండేందుకు ట్రై చేస్తే ఆమె కంటి నుండి నీళ్లు ధారలా కారాయట. దీంతో వేసుకున్న మేకప్ అంతా చెడిపోయిందని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.. ఇలా ఎందుకు అవుతోందని డాక్టర్ కు చూపిస్తే అదొక వింత వ్యాధి అని చెప్పుకొచ్చారట.(Laila)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *