Laxmi Reddy: కిరణ్ రాయల్ దగ్గర పవన్ కళ్యాణ్ వీడియోల పెన్ డ్రైవ్?
Laxmi Reddy: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు లక్ష్మీ రెడ్డి. జనసేన తిరుపతి నేత కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మీరెడ్డి తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేసింది. రోజా కుటుంబ సభ్యులతో.. కిరణ్ రాయల్.. సఖ్యత పెంచుకున్నాడని బాంబు పేల్చింది.

Laxmi Reddy comments on kiran and pawan kalyan
రోజాకు సంబంధించిన ఓ మహిళా బంధువుతో రిలేషన్ పెట్టుకున్నాడని కూడా తెలిపింది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సంబంధించిన వీడియోల పెన్ డ్రైవ్ కూడా తన దగ్గర ఉందని కిరణ్ రాయల్ చాలా సార్లు తనతో చెప్పినట్లు… లక్ష్మీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.
చంద్రబాబు నాయుడు అలాగే వైయస్ జగన్ సహా ఎవరిని తిట్టినా పవన్ కళ్యాణ్ నన్ను ఏమీ అనడు అని కిరణ్ రాయల్ నాతో చాలా సార్లు చెప్పాడంటూ… చెప్పుకొచ్చింది లక్ష్మీరెడ్డి. దీంతో లక్ష్మిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి.