Bottle Gourd: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక మరికొందరేమో అసలు ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా బయటి ఆహారాన్ని తింటూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అయితే ప్రస్తుతకాలంలో ఎక్కువగా కల్తీ ఆహారాన్ని తీసుకోవడం వల్ల లేనిపోని వ్యాధులు వస్తున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆకుకూరలు, పండ్లు, మాంసాహారం, కూరగాయలు అధిక మోతాదులో తీసుకోవాలి. ఇక ఇందులో భాగంగానే వాటర్ కంటెంట్ ఉండే ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. Bottle Gourd
Lots of benefits with Bottle Gourd in monsoons check those problems
అయితే వాటర్ కంటెంట్ ఉండే వాటిలో సొరకాయ కూడా ఒకటి. ఈ సొరకాయలో 90% వరకు నీరు ఉంటుంది. అందువల్ల దీనిని తిన్నట్లయితే శరీరం హైడ్రెటెడ్ గా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో వేడి అంతా తగ్గిపోయి చల్లగా హాయిగా ఉంటారు. ముఖ్యంగా అధిక బరువుతో బాధపడేవారు సొరకాయని తినడం వల్ల చాలా మంచిది అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సొరకాయను ప్రతిరోజు ఉదయం పూట జ్యూస్ చేసుకుని ఒక గ్లాస్ తాగినట్లయితే శరీరంలో ఉండే కొవ్వు అంతా కరిగిపోతుంది. అంతేకాకుండా పొట్ట లోపలి భాగం అంతా శుభ్రమై జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. Bottle Gourd
Also Read: Hindustan Power Kela Sons: త్రీ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది…60 కిమీ మైలేజ్…ధర ఎంతంటే !
ఏసిడిటీ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె చుట్టూ పేరుకుపోయిన కొవ్వును, చెడు రక్తాన్ని తీసివేస్తుంది. అంతేకాకుండా సొరకాయలో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల బిపి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు సొరకాయను తినడం వల్ల రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు తగ్గుతాయి. సొరకాయలో పీచు పదార్థం ఉండడం వల్ల శరీరంలో అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది. కానీ ఈ సొరకాయను కేవలం పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అధికంగా తీసుకున్నట్లయితే జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. Bottle Gourd
మరి ముఖ్యంగా చిన్నపిల్లలకు సొరకాయను అస్సలు తినిపించకూడదు. వారికి జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. సొరకాయలో నీటిశాతం ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకి చాలా తొందరగా చలువ చేస్తుంది. పెద్దవారు కూడా కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే సొరకాయని తినడం మంచిది. ఇక ఈ సొరకాయ ఆరోగ్యానికి మంచిది కదా అని మూడు నాలుగు సార్లు తిన్నట్లయితే అనారోగ్యం కూడా చాలా తొందరగా సంభవిస్తుంది అని వైద్యులు చెబుతున్నారు. Bottle Gourd