Rohit Sharma: ఐపీఎల్ 2025 నుంచి రోహిత్ శర్మ ఔట్?
Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. ముంబై ఇండియన్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టోర్నమెంట్ నుంచి మొత్తం దూరమయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. లక్నో సూపర్ జెంట్స్ జట్టుతో మ్యాచ్ కంటే ముందు… ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ శర్మ మోకాలికి గాయమైందని చెబుతున్నారు.

LSG Vs MI Rohit Sharma OUT Of Play Due To Injury
ఈ తరుణంలోనే.. శుక్రవారం ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో.. రోహిత్ శర్మను పక్కకు పెట్టారు హార్దిక్ పాండ్యా. రోహిత్ శర్మకు మోకాలికి గాయం అయిందని… అందుకే ఇవాల్టి మ్యాచ్ ఆడటం లేదని ప్రకటించేశాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా.
అయితే గాయం తీవ్రత ఎక్కువైతే… మరికొన్ని మ్యాచ్ లకు కూడా రోహిత్ శర్మ దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. ఇక టీమిండియా కు ఆడాలని అనుకుంటే ఈ టోర్నమెంట్ నుంచి రోహిత్ శర్మ వైదొలిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఆడకుండా… రెస్ట్ తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. అదే జరిగితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నుంచి రోహిత్ శర్మ దూరం అవుతాడు.
Revanth Reddy: కమిటీ ఏర్పాటు హడావిడి నిర్ణయం.. రేవంత్ రెడ్డి ఆలోచనా తీరు ఇంత దారుణమా?