Lucknow Super Giants: శార్దుల్ ఠాకూర్ కు లక్నో ఆఫర్ ?
Lucknow Super Giants: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. మార్చి 22వ తేదీ నుంచి… అంటే రేపటి నుంచి మే 25వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ కొనసాగనుంది. మొదటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫైట్ ఉండనుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో లక్నో జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కొత్త ప్లేయర్ ను తమ జట్టులో చేర్చుకోపోతుందట ఆ లక్నో.

Lucknow Super Giants Bumper Offer To Shardul Thakur
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్ ను తమ జట్టులో చేర్చుకునేందుకు లక్నో నిర్ణయం తీసుకుందట. లక్నో బౌలర్ మొహ్సిన్ ఖాన్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. అందుకే అతని స్థానంలో టీమిండియా ఆల్రౌండర్ షార్ధుల్ ఠాకూర్ ను బరిలోకి దించేందుకు నిర్ణయం తీసుకుందట లక్నో యాజమాన్యం.
ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి మొన్నటి మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్ ను ఎవరు కొనుగోలు చేయలేదన్న సంగతి తెలిసిందే. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ అలాగే కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు శార్దూల్ ఠాకూర్ ప్రాతినిధ్యం.. వహించాడు అన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ మొన్నటి మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్ ను కొనుగోలు చేయలేదు ఏ జట్టు కూడా ! అయితే అతన్ని తాజాగా లక్నో తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.