Madhavi Latha – JC: కూటమిలో చీలిక… టిడిపి వర్సెస్ బిజెపి?

Madhavi Latha – JC: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంలో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ హీరోయిన్, బిజెపి నేత మాధవి లత చేసిన కామెంట్లకు టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాడిపత్రిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని మాధవి లత చేసిన కామెంట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రభాకర్ రెడ్డి. అంతేకాదు బిజెపి పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. Madhavi Latha – JC

Madhavi Latha JC Controversy in AP

బిజెపి కంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా మంచిదని కొనియాడారు జెసి ప్రభాకర్ రెడ్డి. ఇలాంటి నేపథ్యంలోనే ఏపీ మంత్రి సత్య కుమార్ స్పందించడం జరిగింది. వయసు ఎక్కువ అయిందని… మతిస్థిమితం లేకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడని ఆగ్రహించారు ఏపీ మంత్రి సత్య కుమార్. వయసుకు తగ్గట్లు జెసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడాలని… నిప్పులు చెరిగారు. Madhavi Latha – JC

Also Read: Revanth Reddy: మరో వివాదంలో రేవంత్ రెడ్డి…షూలపై సెటైర్లు ?

గతంలోనే జెసి ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన బస్సులపై అనేక ఆరోపణలు వచ్చినట్లు గుర్తు చేశారు. అప్పుడు తాను కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు వివరించారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. కూటమిలో టిడిపి అలాగే బిజెపి ఉన్నాయి. అనవసరంగా బిజెపి నేతలను తిట్టకూడదని తురకలు అంటించారు సత్య కుమార్. మళ్లీ ఇది రిపీట్ అవుతే… మేం గట్టిగానే కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు సత్య కుమార్. దీంతో కూటమిలో కుమ్ములాట మొదలైందని వైసిపి ప్రచారం చేస్తోంది.Madhavi Latha – JC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *