Monalisa: బాలీవుడ్ లో బంపరాఫర్ కొట్టేసిన మహా కుంభమేళ మోనాలిసా..?

Monalisa: యూపీలో జరిగే ప్రయాగరాజ్ లో 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ మహా కుంభమేళకి ఎంతోమంది నాగసాధువులు, అఘోరాలు, సామాన్య ప్రజలు ఇలా ఎంతో మంది తరలివస్తున్నారు. అయితే ఈ మహా కుంభమేళలో చాలామంది వైరల్ అవుతున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో రుద్రాక్షలు అమ్ముతూ కనిపించిన తేనెకళ్ళ అమ్మాయి మోనాలిసా కూడా చాలా ఫేమస్ అయింది.

Maha Kumbh Mela Monalisa who hit a bumper in Bollywood

Maha Kumbh Mela Monalisa who hit a bumper in Bollywood

అలా కుంభమేళలో రుద్రాక్షలు అమ్ముతూ తేనె కళ్ళతో ఉన్న ఆమెని చూసిన ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.. ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో తెలియదు..అలా మహాకుంభమేళలో ఈ తేనెకళ్ల సుందరి ఫేమస్ అయింది. ఇక ఫేమస్ అవ్వడమే ఈమె పట్ల శాపంగా మారింది. ఎందుకంటే చాలామంది ఈమెతో ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి వచ్చి ఆమె బిజినెస్ ని పాడు చేస్తున్నారు.(Monalisa)

Also Read: Hero: గుడ్ న్యూస్..పెళ్ళై ఏడాది కాకముందే తండ్రి కాబోతున్న హీరో..?

ఈమె వాళ్ళ కారణంగా మాస్కులు పెట్టుకొని స్వెటర్లు వేసుకొని మొహం మొత్తం కనిపించకుండా రుద్రాక్షలు అమ్ముతోంది. అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి రావడంతో బాలీవుడ్ డైరెక్టర్ అయినటువంటి సనోజ్ మిశ్రా తన మూవీ అయినటువంటి డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్టు ప్రకటించారు.

Maha Kumbh Mela Monalisa who hit a bumper in Bollywood

ఈ సినిమాలో వ్యవసాయం చేసే రైతు కూతురు పాత్రకి మోనాలిస కరెక్ట్ గా సెట్ అవుతుంది అని సనోజ్ మిశ్రా చెప్పారు. త్వరలోనే ఈ అమ్మాయిని నా సినిమాలో తీసుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం మీడియాలో వైరల్ అవ్వడంతో మోనాలిసా బంపర్ ఆఫర్ కొట్టేసింది అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.(Monalisa)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *