Mahesh Babu: ఛీ ఛీ.. దరిద్రం అంటే మహేష్ బాబుదే..అంత చెత్త నిర్ణయమా.?
Mahesh Babu: కొన్ని కొన్ని సందర్భాలలో ఛీ.. ఛీ..దరిద్రం అంటే వీరిదే అని కొంతమంది అనుకుంటే ఉంటారు.అయితే ప్రస్తుతం మహేష్ బాబు గురించి ఈ విషయం తెలిస్తే మీరు కూడా దరిద్రం అంటే మహేష్ బాబుదే అనుకుంటారు. మరి ఇంతకీ మహేష్ బాబు కి చుట్టుకున్న ఆ దరిద్రం ఏంటి..అసలు ఆయన తీసుకున్న ఆ చెత్త నిర్ణయం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీలోకి రాజకుమారుడు మూవీ తో వచ్చినప్పటికీ ఆయనకు ఈ సినిమా కంటే ముందే పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయట.

Mahesh Babu Is that a bad decision
కానీ కృష్ణ ఒప్పుకోకపోవడంతో ఆ సినిమాలు వేరే హీరోస్ చేయాల్సి వచ్చింది. అయితే సినిమాల్లోకి హీరోగా వచ్చాక కూడా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను మహేష్ బాబు తన చేతులారా వదులుకున్నారట. అలాంటి సినిమాల్లో ప్రభాస్,త్రిష స్టార్ హీరో హీరోయిన్గా చేసిన వర్షం మూవీ ఒకటి. అయితే ప్రభాస్ త్రిష కాంబినేషన్లో వచ్చిన వర్షం మూవీలో మొదటి హీరోగా మహేష్ బాబునే అనుకున్నారట డైరెక్టర్ శోభన్.. అయితే ఈ స్టోరీ ప్రభాస్ ని అనుకోక ముందు మహేష్ ని అనుకున్నాక వాళ్ళ ఇంటికి వెళ్లి మరీ కథ వినిపించారట డైరెక్టర్ శోభన్.(Mahesh Babu)
Also Read: Prabhas upcoming movies: ప్రభాస్ సినిమాల లైనప్ సెట్ అయినట్లే.. ఆ మాస్ యాక్షన్ మరింత వెనక్కి!!
కానీ కథ విన్న మహేష్ బాబు అంత రెస్పాండ్ అవ్వకపోవడంతో పాటు సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో చాలా రోజులు వెయిట్ చేసినా డైరెక్టర్ శోభన్ వెంటనే ప్రభాస్ కి ఈ స్టోరీ చెప్పారట. అయితే కథ బాగా నచ్చడంతో వెంటనే ప్రభాస్ ఓకే చెప్పారట.అలా ప్రభాస్ త్రిష కాంబినేషన్లో గోపీచంద్ విలన్ గా తెరకెక్కిన వర్షం సినిమా 2004లో విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

అంతేకాదు ఈ సినిమాతో ప్రభాస్ కి ఇండస్ట్రీలో స్టార్ హీరో ఇమేజ్ అలాగే త్రిష కకి కూడా టాలీవుడ్ లో మంచి ఇమేజ్ వచ్చింది. ఇక ఈ సినిమా ద్వారా హీరో హీరోయిన్ కి మాత్రమే కాదు సినిమాకి కూడా మూడు నంది అవార్డులు వచ్చాయి.అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక చాలామంది మహేష్ అభిమానులు దరిద్రం అంటే మహేష్ బాబుదే..వర్షం సినిమాను వద్దనుకొని అంత చెత్త నిర్ణయం ఎలా తీసుకున్నారో అంటూ మాట్లాడుకున్నారు.(Mahesh Babu)