Mahesh Babu: అప్పుడే ఓ షెడ్యూల్ ను కంప్లీట్ చేసిన రాజమౌళి!!
Mahesh Babu: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హాలీవుడ్ స్థాయిలో రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ భారీ ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఆమె ఈ చిత్రానికి భారీ పారితోషికం అందుకుంటున్నారు. ఇటీవల, తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వివాహ వేడుక కోసం ముంబై వెళ్లేందుకు, హైదరాబాద్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె కనిపించారు.
Mahesh Babu Next Movie with Rajamouli
ప్రియాంక షూటింగ్‌కు తాత్కాలిక విరామం తీసుకున్నా, సినిమా షూటింగ్ మాత్రం నిరాటంకంగా కొనసాగుతోంది. రాజమౌళి, మహేష్ బాబుతో ఉన్న సన్నివేశాలను ప్లాన్ చేసుకొని, షెడ్యూల్ ప్రకారం చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు. అతి త్వరలోనే ప్రియాంక తిరిగి టీమ్‌లో జాయిన్ అవ్వనున్నారు. మహేష్ బాబు ఈ చిత్రంలో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ అవతార్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల రచయిత విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను, రాజమౌళి, దక్షిణాఫ్రికా నవలా రచయిత స్మిత్ కు పెద్ద అభిమానులం. అందుకే, ఆయన పుస్తకాల ఆధారంగా స్క్రిప్ట్‌ను రూపొందించాం,” అని పేర్కొన్నారు. దీంతో, ఈ సినిమా ఒక అద్భుతమైన అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్నట్లు కన్ఫర్మ్ అయింది. రాజమౌళి స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా రూపొందుతున్న ఈ పాన్-ఇండియా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా గురించి రోజురోజుకు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.