SSMB29 Movie: రాజమౌళి మహేష్ చిత్రం అప్‌డేట్.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్!!


SSMB29: Rajamouli's surprise Mahesh Babu SSMB29 Movie Latest News shooting update

SSMB29 Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న #SSMB29 చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బాహుబలి’, ‘RRR’ వంటి చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచిన రాజమౌళి, మహేష్ బాబుతో కలిసి పనిచేయడం అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది.

Mahesh Babu SSMB29 Movie Latest News

ఇటీవల, అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైన షూటింగ్, ప్రియాంక చోప్రా వ్యక్తిగత పనులు మరియు రాజమౌళి బంధువు మృతి కారణంగా వాయిదా పడింది. అయితే, ఫిబ్రవరి 24న తిరిగి ప్రారంభమైన షూటింగ్‌లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించేందుకు రాజమౌళి మరియు మహేష్ బాబు త్వరలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. సమావేశంలో సినిమా తారాగణం, ఇతర ప్రత్యేక అంశాల గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది. అభిమానులు ఈ సమావేశం తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మహేష్ బాబు మూవీస్” ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. మరి ఈ సినిమ తో జక్కన్న ఏ స్థాయి లో విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *